మంచి ఎంట్రీగా ఫీలవుతున్నా

ఆషికా రంగనాథ్‌ తెలుగులో నటించిన తొలి చిత్రం ‘అమిగోస్‌’. కళ్యాణ్‌ రామ్‌ హీరోగా, రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 17న ఈ మూవీ గ్రాండ్‌గా రిలీజ్‌ అవుతుంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ ఆషికా రంగనాథ్‌ మీడియాతో ముచ్చటించారు.
‘చిన్నప్పట్నుంచి తెలుగు సినిమాలు, పాటలు వినేదాన్ని. దాని వల్ల తెలుగు అర్థమయ్యేది. ఇప్పుడు వర్క్‌ చేస్తున్నాను. దాని వల్ల నేర్చుకోవటానికి అవకాశం వచ్చింది. సినిమాలో డైలాగులు చెప్పడం వల్ల తెలుగు కొంచెం నేర్చుకోగలుగుతున్నాను. డైరెక్టర్‌ రాజేందర్‌ రెడ్డి కథ చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. సినిమాలో హీరో మూడు పాత్రలు చేయటం, నా పాత్రను మలిచిన తీరు అన్ని నచ్చడంతో సినిమాకు ఓకే చెప్పేశాను. నేను కళ్యాణ్‌ రామ్‌ని ఫస్ట్‌ ‘అమిగోస్‌’ సెట్‌ లోనే చూసాను. తెలుగు డైలాగ్స్‌ విషయంలో ఆయన చాలా సాయం చేశారు. కళ్యాణ్‌ రామ్‌ చాలా కూల్‌ పర్సన్‌. ఆయనకి చాలా విషయాలు మీద ఎక్కువ అవగాహన ఉంది. అలాంటి ఒక లెజెండ్‌ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోతో పని చేస్తున్నందుకు చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమాలో ఆయన మూడు పాత్రల్లో నటించారు.
ప్రతి పాత్రకు ఆయన చేసిన కషి చూసి ఫిదా అయ్యాను. ఈ సినిమాలోని సాంగ్‌ డ్రీమ్స్‌ రిలీజ్‌ అయినప్పుడు చాలామంది. వెల్‌కమ్‌ టు టాలీవుడ్‌ అని మెసేజ్‌ పెట్టారు. ఇక్కడ కొత్త వారిని చాలా బాగా ఆదరిస్తారని పేరు ఉంది. దాన్ని నేను ప్రత్యక్షంగా ఎక్స్‌పీరియన్స్‌ చేశాను. కన్నడలో ఇప్పటి వరకు 12 సినిమాలు చేశాను. తమిళంలో ఓ సినిమా చేశాను. ఈ చిత్రంతో తెలుగులోకి అడుగు పెట్టాను. నటిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేయాలి. అలాగే పలు భాషల్లోనూ నటించాలి. తెలుగులో ఇతర సినిమాల్లో నటించమని అవకాశాలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాను. దీని తర్వాత మంచి పాత్రలు అనిపించిన సినిమాల్లో నటిస్తాను. తెలుగు ఆడియెన్స్‌ గొప్ప మనసున్నవారు. ఇక్కడ కన్నడ పరిశ్రమకు చెందిన నటీనటులు చాలా మంది రాణిస్తున్నారు. హీరోయిన్సే కాదు.. కిచ్చా సుదీప్‌, ధనంజరు, దునియా విజరు, యష్‌.. సహా చాలా మందిని తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. నన్ను కూడా అలాగే ఆదరిస్తారనే నమ్మకంతో ఎదురు చూస్తున్నాను. నటిగా మంచి రోల్‌ చేయటమే కాదు.. మంచి ప్రొడక్షన్‌ హౌస్‌, హీరో ఉన్న సినిమాలో యాక్ట్‌ చేస్తే మంచి ఎంట్రీ అవుతుంది. నాకు ఈ సినిమాతో అవన్నీ చక్కగా కుదిరాయనిపిస్తుంది. దీంతో ఈ సినిమా నాకు కరెక్ట్‌ ఎంట్రీ అనిపిస్తుంది. బాలకష్ణ చేసిన ‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ..’ వంటి ఐకానిక్‌ సాంగ్‌లో నటించటం లక్కీగా ఫీల్‌ అవుతున్నాను. ఈజీగా ఆడియెన్స్‌కు కనెక్ట్‌ అవుతాననిపించింది. కచ్చితంగా నారోల్‌ అందరికీ నచ్చుతుంది’ అని ఆషికా రంగనాథ్‌ చెప్పారు.

Spread the love