అదే నాకు శుభ శకునం

స్వప్న సినిమా నిర్మాణంలో నందిని రెడ్డి దర్శకురాలిగా, సంతోష్‌ శోభన్‌, మాళవిక నాయర్‌ ప్రధాన పాత్రలలో రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. మిత్ర విందా మూవీస్‌తో కలిసి ప్రియాంకదత్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో హీరో సంతోష్‌ శోభన్‌ మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేశారు. ‘పేపర్‌బారు’ చిత్రం తర్వాత సరైన టైమ్‌లో సరైన సినిమా వచ్చిందని భావిస్తున్నాను. ఈ సినిమాలో నేను, షావుకారు జానకీ డార్లింగ్‌ అని పిలుచుకుంటాం. ఇక అక్కంటే మా వాసుకిలా ఉండాలి అనిపించింది. ఎమోషన్స్‌, లైటర్‌వేలో సీన్స్‌ చాలా అద్భుతంగా చేసింది.నా కెరీర్‌లో ఇలాంటి కథకానీ, ఇంతమంది
నటీనటుల కాంబినేషన్‌లో భాగమయ్యే అవకాశం రాదేమోనని అనుకున్నా. దర్శకురాలు నందినీరెడ్డి ఒరిజినల్‌గా నవ్విసూ, ఏడిపిస్తారు. ఈ సినిమాలో ఒరిజినల్‌ స్ట్రెంత్‌.. డ్రామా, ఎమోషన్స్‌, చాలా కొత్తగా అనిపించే సన్నివేశాలే. ఇందులో రుషి అనే పాత్రలో నవ్వుతూ, నవ్విస్తూ ఉంటా. మాళవిక కళ్ళతోనే అభినయించగల నటి. మాది మూడు స్టేజీల్లో కథ నడుస్తుంది. ప్రతి చోటా మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది. ఇటీవలే ఈ సినిమాను ఎటువంటి బీజియమ్‌ లేకుండా చూశాను. బయటకు వచ్చాక చాలా తేలిగ్గా హాయిగా అనిపించింది. అదే శుభ శకునం నాకు’ అని అన్నారు.

Spread the love