Saturday, June 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

- Advertisement -

నవతెలంగాణ-వర్ధన్నపేట
రాత్రి వేళ అకాల వర్షం, ఈదురుగాలులతో వర్షం కారణంగా కొన్ని ఇండ్లు, పలు గ్రామాల్లో, పట్టణంలో దెబ్బతిన పంటలను వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి సందర్శించారు. 7వ వార్డు కొనాపురం ప్రాంతంలో గాదారి సురేష్, గాదారి కుమార్, మెడ సోమయ్య యాటాల యాకయ్య ఇంటి పైకప్పు పూర్తిగా దెబ్బతిన్న ప్రాంతాన్ని తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి సందర్శించారు. వర్ధన్నపేట శాసన సభ్యులు కె. ఆర్ నాగరాజు ఆదేశాల మేరకు దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించి బాధిత కుటుంబ సభ్యులతో చైర్మన్ పాలకుర్తి సారంగా పని మాట్లాడారు. అకాల వర్షం గాలి దుమారంతో నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆధ్వర్యంలో నష్టపోయిన బాధితులను ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో 12 వ వార్డు కౌన్సిలర్ తిరుపెల్లి వాణి కుమారస్వామీ, అధికారులు జిపిఓలు’ గోపి, రమేష్ ప్రజాప్రతినిధులు ఎల్లికట్టే నిఖిల్, చేరిపెల్లి బాబు, ఎల్లికట్టే భాస్కర్, ఎల్లికట్టే యాకయ్య, ఎల్లికట్టే సురేష్, ఎల్లికట్టే అజయ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -