వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మించిన హర్రర్ -యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’.
ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్‌లో చిత్రబృందం ఘనంగా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. కేక్ కట్ చేసి చిత్ర విజయాన్ని ఆనందంగా జరుపుకున్నారు. దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ, ‘హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ నాలెడ్జ్ కంటే మా నాలెడ్జ్ లక్ష రేట్లు ఎక్కువ ఉంది. అందుకే ప్రసన్న కుమార్ వంటి పెద్దల సూచన మేరకే ఆమెకు సారీ చెప్పాను. మొత్తానికి ఒక వివాదంతో సతమతం అయ్యాం.. చివరికి విజయంతో శుభం కార్డు పడింది. విడుదలైన అన్ని చోట్లా మా సినిమాకి అద్భుతమైన స్పందన వస్తోంది. రెండవ రోజు నుంచే థియేటర్‌లు పెరుగుతున్నాయి. చిత్రబృందంలోని ప్రతి ఒక్కరి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైంది. ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు` అని అన్నారు.
ప్రేక్షకులకు కృతజ్ఞతలు
- Advertisement -
- Advertisement -


