రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్, పి.యు. ఎన్.వర్మ సమర్పణలో గండభేరుండ ఆర్ట్స్ బ్యానర్ మీద విజరు దాట్ల తెరకెక్కించిన ట్రావెల్ అడ్వెంచరస్ టాక్ షో ‘సోల్ ట్రిప్’. త్వరలోనే ఈ టాక్ షో మొదటి సీజన్ స్ట్రీమింగ్ కాబోతోంది. జగపతి బాబు, శ్రీకాంత్, కమెడియన్ అలీ వంటి ఆర్టిస్టులని ప్రకతితో మమేకం చేస్తూ విజరు దాట్ల ప్రత్యేకంగా ముచ్చట్లు పెట్టారు. ఈ ఇంటర్వ్యూలకు సంబంధించిన ఆరు ఎపిసోడ్స్‌ని ప్రస్తుతం ఫినిష్ చేశారు. ఈ క్రమంలో ఈ షో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ, ‘నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. మేం దీని కోసం గోవాకి వెళ్లాం. అక్కడే అందరినీ ఇంటర్వ్యూ చేశాం. ఈ ఫస్ట్ సీజన్‌లో ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి. అన్నీ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ”సోల్ ట్రిప్’ నాకు ఎంతో సహజంగా అనిపించింది. ఈ ట్రైలర్ నాకు చాలా నచ్చింది. విజరు చాలా గొప్పగా చిత్రీకరించాడు’ అని శ్యామలా దేవీ చెప్పారు.
నటుడు అలీ మాట్లాడుతూ,”ఈ షో కోసం విజరు మీద నిర్మాతలు చాలా నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకంతోనే మా అందరినీ తీసుకు వెళ్లి ఆరు ఎపిసోడ్స్ చేశాడు. టైటిల్ డిజైన్ కూడా అద్భుతంగా ఉంది’ అని తెలిపారు.
‘మనం ప్రకతితో మమేకం అయినప్పుడు ఎంతో నేర్చుకుంటాం. అందుకే ఈ కాన్సెప్ట్‌ను తీసుకున్నాం. కానీ ఈ కాన్సెప్ట్‌ని నమ్మే ప్రొడ్యూసర్స్, హీరోలు కావాలి. ఆ తరువాత తమడ మీడియా కార్తిక్‌కి ఈ ఐడియాని చెప్పాను. జగపతి బాబు ఫస్ట్ నన్ను నమ్మారు. మూడు రోజుల్లోనే షూటింగ్ చేసేద్దామని అన్నారు. ఆయనకు ఇష్టమైన మారెడుమిల్లిలోనే షూటింగ్ చేశాం.ఆ తరువాత శ్రీకాంత్, అలీ, శివానీ, శివాత్మిక, ఆకాష్ పూరి, వర్ష బొల్లమ్మలతో ఎపిసోడ్స్ చేశాం’ అని విజరు దాట్ల చెప్పారు.
ఆసక్తికరంగా ‘సోలో ట్రిప్’
- Advertisement -
- Advertisement -



