Sunday, August 9, 2026
E-PAPER
Homeప్రత్యేకంఅలనాటి నాటక ప్రస్థానం

అలనాటి నాటక ప్రస్థానం

- Advertisement -

కాలం మారినా రంగులు మారినా పాత నాటకం అందించిన ఆత్మీయత, ఆ పద్యాల మాధుర్యం ఎప్పటికీ చెరిగిపోవు. ‘కావ్యేషు నాటకం రమ్యం’ అన్నారు పెద్దలు. సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నా వాటన్నిటికీ మిన్నగా ప్రజాదరణ పొందింది నాటకం. ఈరోజు మన సాంస్కృతిక వారసత్వానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన అలనాటి నాటక ప్రస్థానం నేడు ‘అలనాటి నాటక ప్రస్థానం మేటి నటుల శ్రవ్య దృశ్య కళారూపకం’ పేరుతో అజో విభోహొ కందాళం ఫౌండేషన్‌ ద్వారా ఆచార్య అప్పా జోస్యులహొసత్యనారాయణ సమర్పణలో మనకు కానుకగా అందించారు. రూపక సంధాన కర్త డాక్టర్‌ కందిమళ్ల సాంబశివరావు. ఈ ప్రయత్నం అపూర్వం, అనన్యం.

తెలుగు నాటక రంగ ప్రస్థానంలో పద్య నాటకం ఒక అద్భుతమైన మైలురాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కేవలం డైలాగులు మాత్రమే కాకుండా కథను పద్యాల రూపంలో పాడుతూ అభినయించడం నాటకాల ప్రత్యేకత. హరిశ్చంద్రలో కాటిసీను పద్యాలు వింటుంటే కండ్లు చెమర్చని ప్రేక్షకుడు ఉండడు. కురుక్షేత్రం నాటకంలో రాయబార పద్యాలు వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది.

సాంకేతికత లేకున్నా సంభ్రమమే
అలనాటి నాటకాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. కాలర్‌ మైకులు లేవు, డిజిటల్‌ సౌండ్‌ సిస్టమ్స్‌ లేవు, కలర్‌ ఫుల్‌ గ్రాఫిక్స్‌ అసలు లేవు కానీ ఒక హార్మోనియం, ఒక తబలా వీటి దరువులతో థియేటర్‌ దద్దరిల్లిపోయేది.హొనటుడు స్టేజి మీద పద్యం అందుకుంటే థియేటర్‌ చివరి బెంచిలో కూర్చొన్న వ్యక్తికి కూడా ఆ గొంతు స్పష్టంగా వినబడేది. రాత్రంతా సాగే నాటకాలను చూసేందుకు ఎడ్లబండ్లు కట్టుకొని చద్దన్నంహొ మూట కట్టుకొని జనాలు వచ్చేవారు. ఊరి చివర చెట్టు కింద చాప దుప్పటి పరిచి కూర్చుని మరీ నాటకం చూసేవారు. స్థానం నరసింహారావు స్త్రీ పాత్ర ధరిస్తే సాక్షాత్తు ఒక నటీమణి స్టేజిహొమీద ఉందని భ్రమ పడే వారు. బళ్లారి రాఘవ, చిత్తూరు నాగయ్య, పీసపాటి నరసింహమూర్తి, డివి సుబ్బారావు మొదలైన మహానటులు తమ కంచు కంఠంతో పాత్రలకు ప్రాణం పోశారు. ఎందరో వెండితెరలోహొవెలుగులీనినహొమహానటుల మూలాలు నాటకం నుంచే… రంగస్థలం గుడిలో ఓనమాలు దిద్ది సినీ జగత్తును ఏలిన వారే!హొఅలనాటి నాటక ప్రస్థానం తలుచుకుంటేహొ గతించిన కాలంలో అవి కనుమరుగవకుండా మన మూలాలను మన ముందుకు తీసుకురావాలని సత్సంకల్పంతోహొరూపుదిద్దుకున్నది అలనాటి నాటక ప్రస్థానం శ్రవ్య దృశ్య రూపకం.

చరిత్ర ఎందుకు?…
చరిత్ర లేకుండా వర్తమానం లేదు. వర్తమానంలో ఉన్న నేటి తరానికి భవిష్యత్తులో ఎంత దూసుకుపోయినాహొమూల వేర్లను వాటి విలువలను మనసులలో నాటక పోయినట్లయితే వారి భవిష్యత్తు పటిష్టత కోల్పోయే ప్రమాదముంది. ప్రత్యేకించి నేటి తరం పరుగుల ప్రపంచంలో డిజిటల్‌ ప్రభావంతో అస్తిత్వం తాలూకు అంశాలను పరిగణనలోకి తీసుకొని భవిష్యత్తును మరింత దృఢంగా రూపొందించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కాలం మారింది. నాటకం స్థానాన్ని సినిమాలు, మొబైల్‌ ఫోన్లు ఆక్రమించాయి. అయినాహొ రంగస్థలంపై పడే రంగుల వెలుతురులో ఉండే ఆ కిక్కే వేరు. అలనాటి నాటక ప్రస్థానం ఒక స్వర్ణ యుగం. ఆ వైభవాన్ని మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి తరంపై ఎంతైనా ఉంది. పాతనాటకాల జ్ఞాపకాలు నెమరు వేసుకొని నాటక రంగంపై గౌరవాన్ని నిలబెట్టు కొని నాటక రంగానికి పునర్వైభవం తీసుకురావలసిన గురుతర బాధ్యత మనందరి మీద ఉంది. అందుకు కంకణం కట్టుకున్న ఇద్దరు మహనీయుల గురించి అవలోకిద్దాం.

ఆచార్య అప్పా జోస్యుల సత్యనారాయణహొ
బహుముఖ ప్రజ్ఞాదురంధరుడు.హొప్రశస్తి గన్న కంప్యూటర్‌ శాస్త్రవేత్త. అజో విభో కందాళం సాహిత్య సంస్థ ద్వారా లక్షల వ్యయంతో భరతనాట్య శాస్త్రం, కళాపూర్ణోదయం, ఆంధ్ర పురాణం వంటి గ్రంథాలను వ్యాఖ్యానాలతో పునర్ముద్రీకరించిన గొప్ప వ్యక్తి. రచయితల గ్రంథాలు అనేకం ప్రచురించారు. తారావళి అనే అరుదైన ప్రక్రియలోహొపంచవటి కావ్యం రాశారు. ఇవన్నీ ఒక ఎత్తు, నాటక రంగానికి ఆచార్య అప్పాజీ సత్యనారాయణ కృషి మరొక ఎత్తు. నాటకహొపుస్తకాలను ప్రచురింపజేసి నాటకాలకు అవకాశం ఇచ్చి నటీనటులను ఉచిత రీతిన సత్కరించి నిత్యం నాటక రంగం కోసం అటు అమెరికా కాలిఫోర్నియా విస్కాన్సిస్‌ విశ్వవిద్యాలయాలలో న్యూజెర్సీలోని స్టీవెన్‌ సన్‌ ఇన్‌స్టిట్యూట్లో ఉన్నత ఉద్యోగాలు చేసినప్పటికీ నాటకంపై మక్కువతో నాటకం పట్ల అంకిత భావంతో నాటక రంగానికి అశేషమైన సేవలు అందిస్తున్నారు.హొహొ

అజో విభో కందాళం ఫౌండేషన్‌ (AVKF):హొ హొ
అప్పాజోస్యుల విష్ణు భోట్ల కందాళంహొ ఫౌండేషన్‌.. తెలుగు భాష, సాహిత్యం, రక్షణకు, నాటక రంగ అభివద్ధికి కృషి చేస్తున్న ప్రముఖ సంస్థ. కథలను సేకరించి నాటికలు ప్రదర్శింప చేయడం తుది ప్రదర్శనకు ఎంపికైన నాటికలను కథానాటికలు సంపుటులుగా ప్రచురించడం, ప్రతిభావంతులకు ప్రతిభా మూర్తి జీవితకాల సాధ్య పురస్కారం, విశిష్ట సాహితీ మూర్తి పురస్కారం, రంగస్థలం సేవాహొపురస్కారం, సరిలేరు నీకెవ్వరు, అసాధారణ ప్రతిభ పురస్కారం వంటి పురస్కారాలు అందిస్తూ వార్షిక సభలను, సదస్సులను నిర్వహిస్తుంది ఈ ఫౌండేషన్‌.

తెలుగు నాటక మూల స్తంభాలు
ప్రతిష్టాత్మక అజోవిభో ఫౌండేషన్‌ తెలుగు నాటక మూల స్తంభాలు అనే బహత్‌ గ్రంథం ప్రచురించారు. రచన డాక్టర్‌ కందిమళ్లహొ సాంబశివరావు, వాడ్రేవు సుందర్‌ రావు. ఈ పుస్తకంలో 120 మంది నాటక కర్తలు 117 నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల వ్యాసాలు 24 చోటుచేసుకున్నాయి. మొత్తంగా 261 వ్యాసాలతో వాడ్రేవు సుందర రావు గారు కొన్ని వ్యాసాలు, అధిక శాతం డాక్టర్‌ కందిమళ్లహొ సాంబశివరావు గారి వ్యాసాలతో ఈ పుస్తకం సత్యనారాయణ సహకారంతో వెలువడింది. వెయ్యి పేజీల ఈ పుస్తకం నాటక రంగానికి ఒక అద్భుతమైన కానుక.

దృశ్య శ్రవ్య రూపకంహొ
తెలుగు నాటకం మూల స్తంభాలు వ్యాస రూపంలో ఉండడంతో ప్రత్యేకించి చదివే వారికే సమాచారం అందుతుంది. మారుతున్న సమాజంలో పుస్తక సంస్కృతి పఠన శక్తి, ఊహాశక్తి, విమర్శనాత్మక ఆలోచన ప్రధాన పాత్ర పోషిస్తే దృశ్య శ్రవ్య సంస్కృతి ఇంటర్నెట్‌ స్మార్ట్‌ ఫోన్‌, దృశ్యాలు, వీడియోలు, గ్రాఫిక్స్‌ వరకు రూపాంతరం చెందింది. ఇవి తక్కువ సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌హొ ఇతర సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫారంలహొద్వారా చూడడం ఆకర్షణ (Aestheticappeal)గా వేగంగా సమాచారం గ్రహించడానికి సాధ్యమవుతుంది. డిజిటల్‌ యుగపు ధోరణులకు అనుగుణంగా మారుతున్న ఈ పరిణామం వల్ల నాటక రంగం పట్ల యువతను కొత్త తరాల వారిని ఆకట్టుకునేలా వారికి నచ్చిన విధంగా, సులభంగా విని చూడగలిగే విధానంలో దృశ్య శ్రవ్య రూపకం 10 గంటల నిడివిలో అలనాటి నాటక రంగ మహనీయులను గురించి వారసలు ఎలా ఉంటారు? ఎలా ఉండేవారు, వారిహొ పద్యాలు పాడగలిగే ధారణ, సంభాషణలు చెప్పగలిగే ప్రతిభ, అభినయ కౌశలం, రంగస్థలంపై వైవిధ్య భరితమైన పాత్రలతో కొన్ని సందర్భాలలో స్త్రీ పాత్రలను తామే ధరించి ప్రేక్షకులను మెప్పించిన విధానం, వారి గురించి మనం ఎంత చెప్పినా అవి ప్రత్యక్షంగా చూస్తేనే చూసేవారికి సంపూర్ణంగా అవగతం అవుతుంది. ఈ దిశలో ఆలోచించి రూపకల్పన చేసిన అతి గొప్ప ప్రయత్నం డాక్టర్‌ కందిమళ్ల సాంబశివరావు సంధాన కర్తగా రూపు దిద్దుకున్న రూపకమైన అలనాటి నాటక ప్రస్థానం.

డాక్టర్‌ కందిమళ్ల సాంబశివరావు
అలనాటి నాటక ప్రస్థానం శ్రవ్య, దృశ్య రూపక ప్రధాన సంధాన కర్త అయిన డాక్టర్‌ కందిమళ్లహొసాంబశివరావు సుప్రసిద్ధ తెలుగు రంగస్థలం నటులు, నాటక రంగ పరిశోధకుడు, అధ్యాపకుడు. నాటక రంగ పరిశోధనలో భారతీయ నాటక రంగ చరిత్రలోని తొలిసారి డిలిట్‌ అందుకున్న విద్వాంసులు, షేక్‌ నాజర్‌ జీవిత చరిత్ర, నాటక రంగ మూల స్తంభాలు వీరి రచనలు. సైజోడెడ్లబండి వంటి అత్యంత ప్రాచుర్యం పొందిన నాటికను రచించి ఉత్తమ నాటికలలో చోటు దక్కించుకున్న నాటికగా ప్రశంసలు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఫిలిం టెలివిజన్‌, నాటక రంగాల అభివద్ధి కమిటీ సీనియర్‌ సభ్యులుగా పనిచేశారు ప్రస్తుతం డైరెక్టర్‌గాహొపనిచేస్తున్నారు. తెలుగు నాటక కళాకారుల వెలుగులు తెలుగు నాటక రంగానికి శోభను తీసుకువచ్చిన అలనాటి నాటక కళాకారుల గురించి ప్రత్యేకంగా వారి జీవిత ప్రయాణం, నాటక రంగానికి చేసిన సేవలు, వేదికపై వారి అద్భుత నటనను గుర్తుచేసే అంశాలను వీడియోలుగా చేసి అందించాలని సంకల్పించారు. వ్యవస్థాపకులు ఆచార్య అప్పాజీ సత్యనారాయణ సమర్పణలోహొరూపుదిద్దుకుంది అలనాటి నాటక ప్రస్థానం.

అలనాటి నాటక ప్రస్థానం
ఈ శ్రవ్య దృశ్య మేటి నటుల నాటక ప్రస్థానంలో యూట్యూబ్‌లో లింక్‌ ద్వారా చూసినట్లయితే వివిధ ప్లే లిస్టులు కనబడతాయి. ఒక్కో ప్లే లిస్ట్‌లో నాటక రంగానికి సేవ చేసిన ప్రముఖ కళాకారుల కథలు, వారి నాటక ప్రయాణం, సాధన, వేదిక నటనలో విశిష్టతలు, తెలుగు నాటక రంగానికి ఈ కళాకారులు చేసిన అమూల్య సేవలు మన దృష్టి కోణంలోనికి రాని అరుదైన ఫొటోలు వారి వివరాలు వారికి సంబంధించిన జ్ఞాపకాలు వ్యయ ప్రయాసలకోర్చి, అన్వేషించి పలువురు నుంచి సమాచారం సేకరించి వారిని గురించిన రూపకం రూపొందించడం నిజానికి కత్తి మీద సామే.హొ హొ మనం చూడాలనుకుని చూడలేని కళాకారులు, వారి రూపం, అభినయ కౌశలం మనం వినాలనుకుని వినలేని వారి అద్భుత సంభాషణలు, పద్యాలు, గానాలు, స్వరాలు ఒక్కొక్క ప్లే లిస్ట్‌ మనల్ని చూస్తున్న కొద్ది సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తక మానదు. మన తరంతో పాటు మన ముందు తరం వారైన నాన్నలు, తాతలకు ఈ వీడియోలుహొచూపిస్తే మనం వీడియోలతో పాటు వారికి ముఖాలలో ఆనందాలను కూడా వీక్షించిన వారమవుతాం.హొ మన తరువాత తరాల వారిని ఒక్కో ప్లే లిస్ట్‌ వివరణలతో చూపిస్తూ ఉంటే వారు చూడని వారికి తెలియని మన తెలుగు నాటక కళాకారులలోని అద్వితీయ నట సౌరభం, సంభాషణలు చెప్పడంలోనూ, హావ భావాలను ప్రదర్శించడంలోనూ, చమక్కులు విసరడంలోనూ, పద్యాలు పాడటంలోనూ, ఏ కాగితం స్క్రిప్టు చూసుకోకుండా అవలీలగా చెప్పగలిగే సామర్థ్యం చూసి తెలుగు నాటక రంగం పట్ల వారికున్న అపోహల మబ్బులన్నీ తొలగిపోయి అత్యంత సుందరమైన మన సంస్కతికి పట్టుగొమ్మలైన అసలు సిసలైన నాటక కృషీ వరులు వారి కళ్ళ ముందు సాక్షాత్కరిస్తారు.హొ వారిలో ఆ పరిణామం తీసుకురావాలని మన పాతతరం నాటక నటీనటులను పరిచయం చేయాలని ఎంతో శ్రమకూర్చి చేసిన డాక్టర్‌ కందిమళ్లహొసాంబశివరావు యజ్ఞం తప్పకుండా సఫలీకతం అవుతుంది.హొ పది గంటల పాటు ప్రదర్శన వ్యవధి కలిగిన ఈ వీడియోలను ఒక్కొక్కటిగా పరిశీలించి విషయ సేకరణ చేసుకోవచ్చు. తొలుత శ్రీ చాట్ల శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని డిసెంబర్‌ 5న గుంటూరులో దీనిని ఆవిష్కరించారు. జనవరి 4వ తేదీన వరంగల్‌లోహొఒకహొసభలో పరిచయం చేశారు.హొ2026 మార్చి 23న రవీంద్ర భారతిలో రసరంజని ఆధ్వర్యంలో పరిచయ సభ జరిగింది.

యూ ట్యూబ్‌లోకి తొంగి చూస్తే…
యూట్యూబ్‌ వేదికలో శ్రవ్య, దృశ్య కళా రూపకంలో లింకు ద్వారా ప్రవేశిస్తే అలనాటి నాటక రంగ మహనీయులు తొలుత ప్రతి నాటకానికి ముందు పాడేహొ ‘పర బ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ.. ప్రారంభ గీతం వినిపిస్తుంది.హొశ్రీ చాట్ల శ్రీరాములు, ఆచార్య మొదలి నాగభూషణ శర్మలకు ఈ రూపకం అంకితమివ్వబడింది. ఈ వీడియోలలో గాత్రం శ్రీ భాగి కష్ణమూర్తి (చీరాల), పాటను మోదుకూరి జాన్సన్‌ నటనాలయం నుంచి స్వీకరించారు. ఎడిటింగ్‌ పవన్‌ కుమార్‌ పసుపులేటి, సహకారం ములుపూరు సాహిత్‌ శర్మ బాపట్ల నుంచి. వీరి సహకారం దృశ్య శ్రవ్య రూపకానికి సొబగులు అద్దింది. సమర్పణ అప్పాజోస్యులహొ సత్యనారాయణ. దృశ్య, శ్రవ్య రూపక సంధాన కర్త డాక్టర్‌ కందిమళ్లహొసాంబశివరావు. ఈ వివరాలతో మొదలైన వీడియోలలో వేదం వెంకటరాయ శాస్త్రి, చిలకమర్తి, పానుగంటి, బలిజేపల్లి, హరిశ్చంద్ర, కాళ్లకూరి, తిరుపతి వేంకట కవులు, ఆత్రేయ, గురజాడ, కందుకూరి వీరందరిని స్మరిస్తూ అప్పా జోస్యుల సత్యనారాయణ రచించిన పద్యం శ్రవణపేయంగా వినిపిస్తుంది. 150 ఏండ్ల విస్తతి కలిగిన నాటక సంపత్తిని భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరిదీ. ఈ దిశగా అజోవిభో ఫౌండేషన్‌హొనాటక రంగ మూల స్తంభాలు అనే గ్రంథాన్ని పుస్తకంగా ప్రచురించింది. దాదాపు 80 మంది కళాకారుల వివరాలన్నీ సేకరించి కర్త కర్మ క్రియ తానై నాటక జగత్‌ ప్రసిద్ధులుగా డాక్టర్‌ కందిమళ్లహొసాంబశివరావు అనితరసాధ్యమైన కషితో చరిత్రలో నిలిచిపోయే పని చేశారు. సాంబశివరావు కళా పోషకులు, కళారాధకులు, కళా ప్రేమికులు. నటుడుగాని నటులు, వటుడుగాని వటులై విరాజిల్లిన వారి గురించి ఎంత చెప్పినా అది దృశ్య ద్రవ్య రూపకంలో చూసి తీరాల్సిందే! అదే అలనాటి నాటక ప్రస్థానం.

నిత్య నాటక చైతన్య స్ఫూర్తి
ఈ రూపకాన్ని ఎనిమిది భాగాలుగా విభజించారు. బళ్ళారి రాఘవ, వేమూరి గగ్గయ్య, బలిజేపల్లి, స్థానం నరసింహారావు, ఎడవల్లి సూర్యనారాయణ, సంజీవరావు, కపిల వాయి రామనాథ శాస్త్రి, ఈడుముక్కల, మాధవ పెద్ది, వెంకట రామయ్య, బెల్లంకొండ సుబ్బారావు, గండికోట జోగినాధం, పారుపల్లి సుబ్బారావు, ఘంటసాల రాధా కృష్ణయ్య సోదరులు, అద్దంకి శ్రీరాములు, పులిపాట వెంకటేశ్వర్లు, జమునా రాయలు, గుడూరుహొసావిత్రి, ఏ వి సుబ్బారావు, భాను ప్రకాష్‌, ఏ.ఆర్‌.కృష్ణ, బుర్రాహొసుబ్రహ్మణ్యం, బందా కనక లింగేశ్వర రావు.. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా 84 మంది కళాకారులను చూసే అవకాశం, వారి పద్యాలు వినే మహాభాగ్యం మనకు కలుగుతుంది.హొ హొ

భావితరాలకు అలనాటి మేటి నాటక రంగ మహనీయులను పరిచయం చేసిన డాక్టర్‌ కందిమళ్లహొ సాంబశివరావు కృషిని ఎంత చెప్పినా తక్కువే. నాటక రంగం వారి సేవకు రుణపడింది. అద్భుతమైన రూపకంగా మలిచిన వారి కృషికి సమర్పించిన ఆచార్య అప్పా జోస్యులహొ సత్యనారాయణకు హృదయపూర్వక శుభాభినందనలు. నాటకం వర్ధిల్లు గాక. నాటక వైభవం విరాజిల్లుగాక. నిత్య నాటక చైతన్య స్ఫూర్తి మనందరిలో కలుగుగాక.

డా. సమ్మెట విజయ
9989820215

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -