ఎక్కువ శిక్ష అనుభవించిన సమరయోధుడు ఆయనేనట?
కేరళ పాఠశాలల్లో క్విజ్ తీరుపై పినరయి విజయన్ ఆగ్రహం
ఆర్‌ఎస్‌ఎస్‌కు యూడీఎఫ్ ద్వారాలు తెరిచిందంటూ విమర్శ
కన్నూర్ : సులభంగా ప్రభావిత మయ్యే చిన్నారుల్లో విభజనవాద జాతీయవాద భావజాలాన్ని చొప్పిం చేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌కు కేరళలోని యూడీఎఫ్ ప్రభుత్వం ద్వారాలు తెరుస్తోందని ప్రతిపక్ష నేత పినరయి విజయన్ శనివారం విమర్శించారు. కన్నూర్‌లో పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఆయన, స్వాతం త్రోద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్ సైద్ధాంతికవేత్త వి.డి.సావర్కర్ ‘ద్రోహపూరితరమైన పాత్ర’ను తుడిచిపెట్టేలా రాజకీయ కోణంలో అడిగిన ఒక ప్రశ్నను పాఠ్యపుస్తకాల్లో యూడీఎఫ్ ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా అనుమతించిందని తెలిపారు. ఉత్తర కేరళలో మంజేశ్వర్, కుంబ్లా, కాసర్‌గోడ్ విద్యా సంస్థల ఉప జిల్లాల్లో లోయర్ ప్రైమరీ పాఠశాలల విద్యార్ధులకు ‘ఫ్రీడమ్ క్విజ్’ పేరుతో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఈ వివాదాస్పద ప్రశ్న కనిపించిన నేపథ్యంలో విజయన్, ప్రభుత్వంపై ఈ విమర్శలు చేశారు. ‘‘బ్రిటీష్ వారి హయాంలో అత్యంత ఎక్కువగా శిక్షను అనుభవించిన స్వాతంత్ర్య యోధుడు ఎవరు? అన్నది ఆ ప్రశ్న. కింద సమాధానంలో ఆ స్వాతంత్ర్య సమరయోధుడిని వి.డి.సావర్కర్‌గా గుర్తించారు. అసలు ఈ ప్రశ్నకు ఎవరు ఆమోద ముద్ర వేశారు? ఆగస్టు 15న 79వ స్వాతంత్ర్య దినోత్సం జరుపుకోనున్న నేపథ్యంలో ఫ్రీడమ్ క్విజ్‌లో ఈ ప్రశ్నను ఎవరు చేర్చారు, అనేది తేల్చడానికి విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ, ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఎంఎస్‌ఎఫ్) డిమాండ్ చేశాయి.
దీంతో కేరళలో ఈ ప్రశ్నపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. సంఘపరివార్ హిందూ మెజారిటీ వాద దృక్కోణంలో చరిత్రను తిరగరాయడానికి ఆర్‌ఎస్‌ఎస్ చేస్తున్న కుటిల యత్నాలకు ప్రభుత్వం చేయూతనిస్తోందని విజయన్ విమర్శించారు. ‘బ్రిటీష్ వారితో చేతులు కలపడం ద్వారా స్వాతంత్ర్య ఉద్యమానికి సావర్కర్ ద్రోహం చేశారు. స్వాతంత్ర్య పోరాటానికి దూరంగా ఉండాల్సిందిగా యువతకు ఆయన పిలుపిచ్చారు. జాతీయ ప్రయోజనాలకు ద్రోహం చేసేలా క్షమాభిక్ష పెట్టాలని బ్రిటీష్ వారిని అభ్యర్ధించి జైలు నుండి బయటపడ్డారు. బ్రిటీష్ వైస్రాయ్‌ను సావర్కర్ కలిశారు, వారికి విశ్వాసపాత్రుడిగా వుంటానని ప్రకటించారు.’’ అని విజయన్ వివరించారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమంటే, స్వాతంత్ర్య ఉద్యమ వారసత్వం తమదేనని ప్రకటించుకునే కాంగ్రెస్, కేరళలోని ప్రగతిశీల, సెక్యులర్‌వాదంతో కూడిన పాఠశాల సిలబస్‌లోకి మీరు-మేము అంటూ మతోన్మాదంగా చీలికలు తెచ్చేలా ఇటువంటి భావజలాన్ని చొప్పించడానికి ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నిస్తుంటే ఎలాంటి అభ్యంతరం చెప్పడం లేదని విజయన్ తెలిపారు. కాంగ్రెస్ నాయకత్వం నెమ్మదిగా మితవాద భావజాలం వైపు మొగ్గు చూపుతోందని యూడీఎఫ్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం రోజునే పూర్తి స్థాయిలో ప్రదర్శితమైందని అన్నారు.



