Friday, September 18, 2026
E-PAPER
Homeచైల్డ్ హుడ్టగ్‌ ఆఫ్‌ వార్‌ (ఘర్షణ బలం)

టగ్‌ ఆఫ్‌ వార్‌ (ఘర్షణ బలం)

- Advertisement -

కావలసిన వస్తువులు: సమానమైన ఎక్కువ పేజీలు గల రెండు పుస్తకాలు.
ప్రయోగం చేయు విధానం: సమానమైన ఎక్కువ పేజీలు గల రెండు పుస్తకాలు తీసుకోవాలి. పుస్తకములోని పేజీలను ఒకదాని మీద ఒకటి ఫొటోలో చూపించిన విధంగా వేసుకోవాలి. తర్వాత ఇద్దరు విద్యార్థులు వెనుక వైపు ఉన్న అంచులను పట్టుకొని లాగి గమనించాలి.
ప్రయోగ వివరణ: రెండు వస్తువుల తలాల మధ్య ఉన్న పరస్పర కదలిక నిరోధమే ఘర్షణ. ఇక్కడ పుస్తకంలోని రెండు పేజీల మధ్య ఘర్షణ వలన పేజీల కదలిక మీద ప్రభావం పడుతుంది. ప్రతి పేజీకి సంబంధించిన ఘర్షణ తోడై రెండు పుస్తకాలను లాగి విడదీయడం కష్టతరం అవుతుంది.

– వాలుగొండ వెంకటేశ్వర్లు,
సైన్స్‌ పాపులరైజర్‌, 9640053470

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -