Sunday, June 14, 2026
E-PAPER
Homeఆటలుస్విట్జర్లాండ్‌కు షాక్‌.. ఫిఫా చరిత్రలో ఖతార్‌కు తొలిసారి పాయింట్‌

స్విట్జర్లాండ్‌కు షాక్‌.. ఫిఫా చరిత్రలో ఖతార్‌కు తొలిసారి పాయింట్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఫిఫా ప్రపంచకప్‌ గ్రూప్‌-బి మ్యాచ్‌లో స్విట్జర్లాండ్‌, ఖతార్‌ జట్లు 1-1తో డ్రా అయ్యాయి. మ్యాచ్‌ 17వ నిమిషంలో బ్రీల్‌ ఎంబోలో పెనాల్టీ ద్వారా గోల్‌ చేసి స్విట్జర్లాండ్‌కు ఆధిక్యం అందించాడు. అనంతరం స్విస్‌ జట్టు ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ మరో గోల్‌ సాధించలేకపోయింది. మ్యాచ్‌ ముగియబోతున్న వేళ 90.4వ నిమిషంలో బౌలెమ్‌ ఖౌఖీ హెడర్‌తో గోల్‌ చేసి ఖతార్‌కు సమం చేశాడు. దీంతో ఇరు జట్లు చెరో పాయింట్‌ పంచుకున్నాయి. ఈ ఫలితంతో ఫిఫా ప్రపంచకప్‌ చరిత్రలో ఖతార్‌ తొలిసారిగా ఒక పాయింట్‌ను తన ఖాతాలో వేసుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -