Sunday, June 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహైద‌రాబాద్‌లో క‌దంతొక్కిన ‘కాక్రోచ్‌’

హైద‌రాబాద్‌లో క‌దంతొక్కిన ‘కాక్రోచ్‌’

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: నీట్ పేప‌ర్ లీకేజ్ ఘ‌ట‌న‌ల‌ను వ్య‌తిరేకిస్తూ కాక్రోచ్ జ‌న‌తా పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా ఆందోళ‌న‌ల‌కు పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆదివారం హైద‌రాబాద్ ధ‌ర్నా చౌక్ వద్ద ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. భారీ యోత్తున్న చేరుకున్న నిరుద్యోగులు ప్లకార్డులు చేత‌బూని మోడీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. నీట్ పేప‌ర్ లీకేజీ కార‌కుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేశారు. ఈ ఆందోళ‌న‌లో ప్రొ.కె.నాగేశ్వ‌ర్, ప‌ర్యావ‌ర‌ణ వేత్త వాంగ్‌చుంగ్ పాల్గొన్నారు. అదే విధంగా విద్యార్థి సంఘాలు డివైఎఫ్ఐ, ఎస్‌ఎప్‌ఐల‌తో వివిధ విద్యార్థి సంఘాలు మ‌ద్ద‌తుగా ధ‌ర్నాలో పాల్గొన్నాయి.

ఇటీవ‌ల ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వేదిక‌గా నీట్ పేప‌ర్‌ లీకేజీ వ్య‌తిరేకిస్తూ క‌దంతొక్కారు. విద్యార్థుల‌ భ‌విష్య‌త్‌తో, జీవితాల‌తో ప్ర‌భుత్వాలు చెలగాటం ఆడుతున్నాయ‌ని, వెంట‌నే కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాల‌ని సీజేపీ అధినేత అభిజిత్ డిమాండ్ చేశారు. ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేసేంత‌వ‌ర‌కు ఆందోళ‌న‌లు కొనసాగుతాయ‌ని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -