నవతెలంగాణ – గీసుగొండ
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ ధర్మారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గోదాసి సూరయ్య సతీమణి, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు గోదాసి చిన్న, గోదాసి వీరేశం మాతృమూర్తి కీ.శే. గోదాసి కుమలమ్మ శనివారం మృతి చెందారు. ఆమె మృతి వార్త తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ఆదివారం ధర్మారంలోని వారి స్వగృహానికి వెళ్లి కుమలమ్మ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుమలమ్మ మృతి కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ, కుటుంబ సభ్యులు అధైర్యపడవద్దని, తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పిస్తూ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గోపాల నవీన్ రాజ్, డివిజన్ నాయకులు, గీసుగొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని కుమలమ్మకు నివాళులర్పించారు.
గోదాసి కుమలమ్మ నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్సీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



