Sunday, June 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విలీన సీతారాంపురంలో ఘనంగా బొడ్రాయి మహోత్సవం

విలీన సీతారాంపురంలో ఘనంగా బొడ్రాయి మహోత్సవం

- Advertisement -

విరాళం ప్రకటించిన పీఏసీఎస్ చైర్మన్ నల్లెల్ల లింగమూర్తి
నవతెలంగాణ – పరకాల 

పరకాల పట్టణం విలీన సీతారాంపురంలో జరగనున్న బొడ్రాయి మహోత్సవం వైభవంగా నిర్వహించేందుకు గ్రామస్తులు సిద్ధమవుతున్నారు. ఈ మహోత్సవం దిగ్విజయంగా సాగాలని ఆకాంక్షిస్తూ పీఏసీఎస్ చైర్మన్ నల్లెల్ల లింగమూర్తి ముందుకొచ్చారు. ఉత్సవ కమిటీ సభ్యులు కోరిన వెంటనే ఆయన స్పందించి, కార్యక్రమ నిర్వహణ కోసం రూ. 1,01,116 భారీ విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ లింగమూర్తి మాట్లాడుతూ.. గ్రామ దేవతల ఆశీస్సులతో జరుపుకునే ఈ పండుగను ఎటువంటి వివాదాలకు తావులేకుండా, గ్రామస్తులందరూ సమిష్టి కృషితో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామంలోని పెద్దలందరి సలహాలు, సూచనలు తీసుకుంటూ ఐకమత్యంతో ముందుకెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కమిటీని కోరారు. చైర్మన్ లింగమూర్తి ఆర్థిక సహకారం అందించడం పట్ల కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలోని పెద్దల సహకారంతో మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తామని కమిటీ సభ్యులు పేర్కొంటూ, ఉదారతతో విరాళం అందించిన లింగమూర్తికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -