- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా భక్తులు మండల కేంద్రంలోని సోమలింగాల ఆలయానికి బారులు తీరారు. ఉపవాసం ఉన్న భక్తులకు మద్నూర్ మండల కేంద్రంలోని సాక్షర, వాగ్దేవి, పాఠశాలల కరస్పాండెంట్ ఏ సందీప్ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ క్రమంలో పాఠశాలల ఫౌండర్ డాక్టర్ సంగమేశ్వర్, కరెస్పాండెంట్ సందీప్ భక్తులకు ఫలహారాలు, మంచినీటి వసతి కల్పించినందుకు భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



