Monday, June 15, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయందక్షిణ బీరుట్‌పై ఇజ్రాయిల్‌ దాడులు

దక్షిణ బీరుట్‌పై ఇజ్రాయిల్‌ దాడులు

- Advertisement -

బీరుట్‌ : లెబనాన్‌ రాజధాని బీరుట్‌లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయిల్‌ సేనలు ఆదివారం బాంబు దాడులు జరిపాయి. ఓ భవనంపై జరిగిన దాడిలో ఇద్దరు చనిపోగా నలుగురు గాయపడ్డారు. బీరుట్‌లో షియాలు అధికంగా నివసిస్తున్న దహియె ప్రాంతంపై ఇజ్రాయిల్‌ పెద్ద ఎత్తున దాడులకు తెగబడింది. ఆ ప్రాంతం జనసమ్మర్దంగా ఉంటుంది. బహుళ అంతస్తుల భవనాలు ఎక్కువగా ఉంటాయి. దహియెలోని హిజ్బల్లా కమాండ్‌ కేంద్రంపై దాడి చేశానని ఇజ్రాయిల్‌ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఇజ్రాయిల్‌ దళాలు కాల్పుల విరమణను ఉల్లంఘిం చినందుకు ప్రతిగా మజ్దల్‌ జౌన్‌ పట్టణ శివారు ప్రాంతంలో వాహనాలు, సైనికులను లక్ష్యంగా చేసుకొని రాకెట్‌ దాడులు చేశామని హిజ్బల్లా తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -