Monday, June 15, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంశాంతి ఒప్పందంపై అనిశ్చితి

శాంతి ఒప్పందంపై అనిశ్చితి

- Advertisement -

సమీక్ష తర్వాతే నిర్ణయం : ఇరాన్‌
టెహ్రాన్‌/వాషింగ్టన్‌ : మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని ముగించేందుకు ఉద్దేశించిన శాంతి ఒప్పందంపై అనిశ్చితి కొనసాగుతోంది. ఆదివారం సంతకాలు జరుగుతాయని, ఆ వెంటనే హార్ముజ్‌ జలసంధిని తెరుస్తారని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ తెలిపారు. ఇరాన్‌ ఇక అణ్వాయుధాన్ని కోరుకోవడం లేదని, శుద్ధి చేసిన యురేనియంను సరైన సమయంలో తొలగించేందుకు టెహ్రాన్‌కు అమెరికా సాయపడుతుందని చెప్పారు. అయితే ఈ వాదనను ఇరాన్‌ తోసిపుచ్చింది. ఒప్పందంపై ‘రాబోయే రోజులలో’ సంతకాలు జరుగుతాయని చెప్పింది. ఒప్పందంపై టెహ్రాన్‌ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఇరాన్‌ మీడియా తెలియజే సింది. కాగా ఒప్పందాన్ని కుదుర్చు కోవడంలో సాయపడేందుకు ఖతార్‌ మధ్య వర్తులు హుటా హుటిన టెహ్రాన్‌ చేరుకున్నారని సమాచారం.

ఇంకా నిర్ణయం తీసుకోలేదు
అమెరికాతో అవగాహనా ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు జరుగుతాయన్న వార్తలను ఇరాన్‌ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్‌ బాఘై తోసిపుచ్చారు. ఇప్పుడు కుదుర్చుకునే ఎంఓయూ తదుపరి చర్చలకు ఉపకరిస్తుందే తప్ప తుది ఒప్పందానికి కాదని స్పష్టం చేశారు. అరవై రోజుల కాల్పుల విరమణపై ఒప్పందం కుదిరితేనే అణు కార్యక్రమంపై సంప్రదింపులు కొనసాగుతాయని చెప్పారు. చర్చల సందర్భంగా ప్రతిపాదించిన ఎంఓయూపై ఇరాన్‌ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, రాజకీయ, న్యాయ, సాంకేతిక కోణాల నుంచి సమీక్ష కొనసాగుతోందని ఫార్స్‌ న్యూస్‌ ఏజెన్సీ తెలియజేసింది.చర్చలలో పురోగతి ఉన్నప్పటికీ ఆంతరంగిక సమీక్షా ప్రక్రియపై తుది నిర్ణయం ఆధారపడి ఉంటుందని ఇరాన్‌ అధికారులు చెప్పారు. ఇదిలావుండగా శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ మషాద్‌ నగరంలోని ఇరాన్‌ రాయబార కార్యాలయం ఎదుట కొందరు ప్రదర్శన నిర్వహించారు. విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాంతి ఒప్పందం ఇరాన్‌ ప్రయోజనాలను కాపాడబోదని, హార్ముజ్‌పై టెహ్రాన్‌కు ఉన్న హక్కును నీరుకారుస్తుందని ప్రదర్శకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒప్పందం కోసం ఇరాన్‌ ప్రతినిధులు అమెరికాకు అనేక రాయితీలు ఇస్తున్నారని మండిపడ్డారు.

నౌకలకు ఐఆర్‌జీసీ హెచ్చరిక
హార్ముజ్‌ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలకు ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) హెచ్చరికలు జారీ చేసింది. హార్ముజ్‌ కారిడార్‌లో రాకపోకలు సాగించే నౌకలపై చర్యలు తప్పవని ఓ ఆడియో సందేశంలో స్పష్టం చేసింది. ‘మీ ఆరోగ్యం, రక్షణ కోసం చెబుతున్నాం. తదుపరి నోటీసు జారీ చేసే వరకూ హార్ముజ్‌లో నౌకాయానానికి స్వస్తి చెప్పండి’ అని సూచించింది. కాగా భారత పతాకంతో ప్రయాణిస్తున్న విరాట్‌-1 అనే నౌక ఓమన్‌ తీరంలో ఇంజిన్‌ వైఫల్యానికి గురైంది. ఈ నౌకలో 14 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని, వారందరినీ రక్షించడం జరిగిందని ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది.4

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -