- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన అనంతరం చమురు ధరలు పడిపోయాయి. డబ్ల్యూటీఐ క్రూడ్ ఫ్యూచర్స్ 4.77 శాతం తగ్గి బ్యారెల్‌కు 80.83 డాలర్లకు చేరగా.. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ సుమారు 4 శాతం తగ్గి బ్యారెల్‌కు 83.77 డాలర్లకు పడిపోయింది. మరోవైపు.. చమురు, గ్యాస్ సరఫరాలు సాధారణ స్థితికి చేరేందుకు నెలలు పట్టొచ్చని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ ఎనర్జీ ప్రతినిధి డేనియల్ ఇవాన్స్ తెలిపారు.
- Advertisement -



