Monday, February 16, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి మృతి

అమెరికాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి మృతి

- Advertisement -

శాన్‌ఫ్రాన్సిస్కో : ఆరు రోజుల క్రితం కనిపించకుండా పోయిన భారతీయ విద్యార్థి సాకేత్‌ శ్రీన్‌వాసయ్య మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. కాలిఫోర్నియా బర్కిలీ యూనివర్శిటీలో కెమికల్‌ అండ్‌ బయోమోలెక్యులర్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్న కర్నాటకకు చెందిన సాకేత్‌ ఫిబ్రవరి 9న అదృశ్యమయ్యాడు. అతని మృతదేహాన్ని గుర్తించినట్లు శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం ద్రువీకరించింది. వీలైనంత త్వరగా అతని భౌతికకాయాన్ని భారత్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని ఒక ప్రకటనలో పేర్కొంది. విద్యార్థి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొంది. సాకేత్‌ చివరిసారిగా యూనివర్శిటీకి కిలోమీటరు దూరంలో కనిపించారని, అనంతరం అదృశ్యయ్యాడని అధికారులు తెలిపారు. అతని పాస్‌పోర్ట్‌, ల్యాప్‌టాప్‌ ఉన్న బ్యాగ్‌ క్యాంపస్‌ సమీపంలోని లిట్డెన్‌ రీజనల్‌ పార్క్‌ దగ్గర గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహం లభ్యమైందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -