Monday, June 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ ప్రైమరీ, ఉన్నత పాఠశాలలు పున: ప్రారంభం 

ప్రభుత్వ ప్రైమరీ, ఉన్నత పాఠశాలలు పున: ప్రారంభం 

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌన్
ఆలేరు పట్టణంలోని ప్రభుత్వ ప్రైమరీ, ఉన్నత పాఠశాలలు సోమవారం నుండి పునః ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎంఈఓ ఎర్ర లక్ష్మీ మాట్లాడుతూ.. నూతన విద్యా సంవత్సరంలో విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ రుచికరమైన మధ్యాహ్న భోజనం  ఐఎఫ్ పి పెనల్ ద్వారా  డిజిటల్ బోధన తో ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయులతో వ్యక్తిగత శ్రద్ధ చూపెడతామన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు విద్యతో  బంగారు బాటలు వేస్తామని చెప్పారు. పాఠశాల పరిసరాలు అహ్లాదకరంగా ఉంచుతామని, పరిసరాల పరిశుభ్రత తో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను  విద్యార్థులకు అలవర్చుతామన్నారు. విద్యా సంవత్సరం సాఫీగా సాగేలా పనిచేస్తామన్నారు. బావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు పనిచేస్తామన్నారు. విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు పట్టణ ప్రముఖులు పాఠశాలల బలోపేతానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -