Monday, June 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలేరు పట్టణంలో పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించండి 

ఆలేరు పట్టణంలో పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించండి 

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌన్ 
ఆలేరు పట్టణంలో పేరుకుపోయిన ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలని, పట్టణ యువజన సంఘం నాయకులు చేన్న రాజేష్ సోమవారం రాష్ట్ర ప్రభుత్వ విప్పు,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో కోరారు. ఆలేరు పట్టణంలో ప్రధానంగా నాలుగు సమస్యలు ఉన్నాయని, ప్రజల సౌకర్యార్థం వంద పడకల ఆస్పత్రిని వెంటనే ఏర్పాటు చేయాలని, హైదరాబాద్, వరంగల్ జాతీయ రహదారికి సమాదూరంలో ఆలేరు పట్టణం బైపాస్ పక్కనే ఉన్నదని, జాతీయ రహదారిపై అనేక రోడ్డు ప్రమాదాలు జరిగి, తక్షణమే  మెరుగైన  వైద్య అందక అనేకమంది మృత్యువాత పడుతున్న సంఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు. ఏరు పట్టణంలో ప్రాథమిక వైద్యం మాత్రమే అందుతుందని మెరుగైన వైద్యం అందాలని కోరారు. దుర్గమ్మ గుడి వద్ద పెద్దవాగుపై  పురాతనమైన బ్రిడ్జి స్థానంలో నూతన బ్రిడ్జి నిర్మించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. గత పది సంవత్సరాల నుండి రెవిన్యూ డివిజన్ కొరకు ఉద్యమాలు జరుగుతున్నాయని, రెవిన్యూ డివిజన్ ఏర్పాటుతో ప్రాంత అభివృద్ధి, యువతకు ఉపాధి కలుగుతుందని, ప్రజలకి ఆలేరు రెవిన్యూ డివిజన్ వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. పట్టణంలోని రఘునాధపురం రోడ్డు, మంతపురి   రోడ్డు ఆర్ఓబి వద్ద  రోడ్డు ప్రమాదాలు జరిగి అనేకమంది మృత్యువాత పడుతున్నారని, ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులు డివైడర్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సానుకూలంగా స్పందించి, సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -