నవతెలంగాణ-ఆలేరు టౌన్
ఆలేరు పట్టణంలో డ్రింకింగ్ వాటర్ సమస్యను వెంటనే పరిష్కరించాలని, రాష్ట్ర ప్రభుత్వ విప్పు, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అధికారులని సోమవారం ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ కే శ్రీనివాస్ రెడ్డిని నీటి సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. పట్టణంలోని 12 వార్డులలో నీటి సమస్య ఎక్కడ తలెత్తిన వెంటనే స్పందించి నీరు సక్రమంగా సరఫరా జరిగేలా చూడాలన్నారు. డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో పట్టణంలోని 12వ వార్డుకు చెందిన కుమారస్వామి గత వారం రోజుల నుండి నీటి సమస్య ఉందని, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కి నీటి సమస్య గురించి వివరించారు.
వెంటనే ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడారు. మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీటి సరఫరా నిలిచిపోయిందని, నీటి ట్యాంకర్ ల ద్వారా 1,8 కార్డులలో నీటి సమస్య తలెత్తినాదని, ప్రైవేట్ బోర్ల ద్వారా నీటీ సరఫరా చేస్తున్నట్లు కమిషనర్ కే శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేకు వివరించారు. 12వ వార్డులో నీటి సమస్య తీర్చేందుకు, మరిన్ని ప్రైవేటు బోర్ల ప్లీజ్ కు తీసుకోవడం ద్వారా నీటి సరఫరా చేపట్టాలని సూచించారు.



