Monday, June 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అనారోగ్య బాధితులకు ఎల్ఏసీ అందజేత

అనారోగ్య బాధితులకు ఎల్ఏసీ అందజేత

- Advertisement -

నవతెలంగాణ – దర్పల్లి
నిరుపేదలకు అత్యవసర సమయంలో కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని నిజమాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన సుంకం నిహాన్య అనారోగ్య సమస్యలతో.. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శస్త్ర చికిత్స నిమిత్తం రూ.5 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు సూచించారు. దీంతో రూ.5లక్షలకు సంబంధించి ఎల్.ఓ.సి లెటర్ బాధిత కుటుంబ సభ్యులలకు ఎమ్మేల్యే తన క్యాంపు కార్యాలయంలో సోమవారం అందజేశారు. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులతో పాటు కాగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాల్ రాజు, సర్పంచ్ శ్రీనివాస్ ఎమ్మెల్యే కు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -