- Advertisement -
నవతెలంగాణ – కాగజ్ నగర్
ఈనెల 16న తెలంగాణ రక్షణ సేన పార్టీ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత కుమురం భీం, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ కు రానున్నారు. కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై చేపట్టనున్న ప్రాజెక్ట్ స్థలాన్ని ఆమె పరిశీలించనున్నారు. తర్వాత కాగజ్ నగర్ లో సిర్పూర్ పేపర్ మిల్లు గేటు ముందు ఎస్పీఎం కార్మికులు చేపడుతున్న దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలుపనున్నట్లు ఆ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ ఇంచార్జి కావేటి సబిత మనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు.
- Advertisement -



