Tuesday, June 16, 2026
E-PAPER
Homeసినిమాసెక్స్ ఎడ్యుకేషన్ నేపథ్యంలో

సెక్స్ ఎడ్యుకేషన్ నేపథ్యంలో

- Advertisement -

మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ‘సూపర్ సుబ్బు’ సిరీస్‌లో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్, మురళీ శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. నెట్ ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్ సిరీస్‌గా తెరకెక్కిన ఈ సిరీస్ జూలై 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ కథలో సుబ్రహ్మణ్యం చిల్లుకూరి రావు అలియాస్ సుబ్బు అనే యువ కుడు, మాకిపూర్ అనే గ్రామంలో సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా ఉద్యో గం పొందుతాడు. ఎలాంటి అను భవం లేకపోయినా, గ్రామస్తులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అడుగుపెట్టిన సుబ్బు, అక్కడ అను కోని సంఘటనలు, విచిత్రమైన ప్రశ్నలు, హాస్యభరిత పరిస్థితులు, జీవితాన్ని మార్చే అనుభవాల మధ్య చిక్కుకుంటాడు.
ఈ ప్రయాణంలో ప్రేమ, కుటుంబం, కెరీర్‌ను పణంగా పెట్టాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. చివరికి అతను తన జీవితంలో సరైన నిర్ణయం తీసుకోగలడా? అనేదే కథ.
సిరీస్ క్రియేటర్, దర్శకుడు మల్లిక్ రామ్ మాట్లాడుతూ, ‘సెక్స్ ఎడ్యు కేషన్ వంటి అంశాలపై ఉన్న సంకోచాన్ని తగ్గిస్తూ, వినోదంతో కూడిన కథ చెప్పాలని అను కున్నాం. అందుకే హాస్యాన్ని ప్రధాన సాధనంగా ఎంచుకున్నాం. సుబ్బు అనే అమాయక పాత్ర ద్వారా కుటుంబ బంధాలు, తరాల మధ్య ఆలోచనా విధానాల్లో తేడాలు, సంబంధాల అందాన్ని చూపించాం. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ మాకిపూర్ గ్రామాన్ని ప్రేమిస్తారని నమ్ముతున్నాం` అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -