ఓటీటీ వేదిక ప్రైమ్ వీడియో తన తాజా తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘ఇసకపట్నం’ ట్రైలర్ ను ఘనంగా విడుదల చేసింది. గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన ఈ ఏడు ఎపిసోడ్ల క్రైమ్ థ్రిల్లర్ ను ప్రశాంత్ రఘతి రచించగా, తాజుద్దీన్ సయ్యద్ మాటలు అందించారు. తమడా మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్పై రాహుల్ తమడా, సైదీప్ రెడ్డి బొర్రా నిర్మించిన ఈ సిరీస్లో ఐశ్వర్య రాజేష్, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషించారు.
జూలై 2 నుంచి ప్రైమ్ వీడియో లో తెలుగు భాషతో పాటు తమిళం, హిందీ డబ్బింగ్ వెర్షన్లు, 15 భాషల సబ్టైటిల్స్తో ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా ప్రాంతాలలో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు గ్యారీ బీహెచ్ మాట్లాడుతూ,’ఇదొక కల్పిత ప్రపంచంలో సాగే కథ అయినప్పటికీ, ఇందులో పాత్రలు, వారి భావోద్వేగాలు చాలా నిజాయితీ గా ఉంటాయి. ఆశ, ప్రేమ, కోల్పోవడం, ప్రతీకారం వంటి అంశాలు ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి. ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠ లో ఉండే ఎన్నో ట్విస్టులు ఇందులో ఉన్నాయిఅని దర్శకుడు గ్యారీ బీహెచ్ తెలిపారు. 'ఈ కథలోని బలమైన భావోద్వేగాలు, నా పాత్రలో ఉన్న వైవిధ్యాలు నన్ను ఆకట్టుకున్నాయి అని సముద్రఖని చెప్పారు.
‘పవర్, సంఘర్షణ తో నిండిన ప్రపంచంలో తనదైన నిర్ణయాలతో ముందుకు సాగే మహిళ భారతిగా ఇందులో కనిపిస్తానుఅని ఐశ్వర్య రాజేష్ తెలిపారు. సునీల్ మాట్లాడుతూ, 'ఈ కథలో ప్రపంచం చాలా వాస్తవంగా ఉంటుంది. ప్రతి పాత్రకు వారి సొంత లక్ష్యాలు, సంఘర్షణలు ఉంటాయి. నేను ఇప్పటి వరకు చేయని కొత్త తరహా పాత్రలో కనిపించ బోతున్నాను అని అన్నారు. అధికారం కోసం జరిగిన పోరాటాలు, కుటుంబ ద్రోహాలు, రాజకీయ ఎత్తుగడలు, ప్రతీకారాలతో నిండిన ఈ సిరీస్ జూలై 2 నుంచి ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది.
పగ, ప్రతీకారాలతో ‘ఇసుకపట్నం`
- Advertisement -
- Advertisement -


