Monday, June 15, 2026
E-PAPER
Homeసినిమా‘బిచ్చగాడు’ విజయానికి మించి..

‘బిచ్చగాడు’ విజయానికి మించి..

- Advertisement -


విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్‌తో కలిసి ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామంజనేయులు జవ్వాజీ నిర్మించిన చిత్రం ‘వంద దేవుళ్ళు’.
విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్ ధీషన్ ముఖ్య పాత్రలను పోషించారు. ‘బిచ్చగాడు’ తరువాత దర్శకుడు శశితో విజయ్ ఆంటోని చేసిన ఈ చిత్రం ఈనెల 19న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా సోమవారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల, దర్శకుడు త్రినాథరావు నక్కిన ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ ఈవెంట్‌లో విజయ్ ఆంటోని మాట్లాడుతూ,’20 ఏళ్ల నన్ను శశి మ్యూజిక్ దర్శకుడిగా పరిచయం చేశారు. పదేళ్ల క్రితం అదే శశి ‘బిచ్చగాడు’ చిత్రంతో హీరోగా నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ ‘వంద దేవుళ్ళు’ అంటూ మేం రాబోతోన్నాం. శశి కథ చెప్పిన తరువాత నేను ఎంతో ఏడ్చేశాను. నాకు కన్నీళ్లు మాత్రం ఆగలేదు. నా పాత్ర చాలా డిఫరెంట్‌గా, కొత్తగా ఉంటుంది. ‘బిచ్చగాడు’ నుంచి నాతో ప్రయాణిస్తున్న భాష్య శ్రీకి థ్యాంక్స్. శశి ఈ మూవీతో కొత్త టెక్నికల్ టీంను పరిచయం చేశారు. మా మూవీని సుబ్బారెడ్డి , మైత్రి శశి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారుఅని తెలిపారు. ‘ఈ మూవీని ఆల్రెడీ నేను చూశాను. శశి తీసిన ‘శ్రీను’ మూవీ చూసి నేను ఏడ్చాను. ఆయన ‘బిచ్చగాడు’ లాంటి గొప్ప సినిమాని తీశారు. పెళ్లి అయితే, పిల్లల్ని కంటే అమ్మాయి అమ్మగా మారిపోతుంది. అయితే అమ్మలోనూ అమ్మాయి ఉంటుంది. అదే పాయింట్‌ను గొప్పగా చూపించారు. 'బిచ్చగాడుని మించిన విజయం ఈ సినిమా సాధిస్తుంది` అని నిహారిక కొణిదెల చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -