Monday, February 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమేఘా గ్రూప్‌ ఆపరేషన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ

మేఘా గ్రూప్‌ ఆపరేషన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మేఘా ఇంజినీరింగ్‌ గ్రూప్‌ సంస్థ ఈవీ ట్రాన్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌లో ఆపరేషన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా మాజీ ఐపీఎస్ అధికారి వి.వి.లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా పనిచేసినప్పటి నుంచి ఆయన జేడీ లక్ష్మీనారాయణగా ప్రసిద్ధి చెందారు. 1990 మహారాష్ట్ర క్యాడర్‌ ఐపీఎస్ అధికారి అయిన లక్ష్మీనారాయణ, విద్యార్థి దశలో వరంగల్ ఎన్‌ఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్, ఐఐటీ మద్రాస్‌లో ఎంటెక్‌ పూర్తి చేశారు. మేఘా గ్రూప్‌కు చెందిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ అనుబంధ సంస్థ ఈవీ ట్రాన్స్‌, విద్యుత్ బస్సులకు ఛార్జింగ్ వ్యవస్థల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు చేపడుతుంది. ప్రస్తుతం ఈ సంస్థ 900కు పైగా బస్సులను నిర్వహిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -