Tuesday, June 16, 2026
E-PAPER
Homeసినిమాప్రేమలో పూర్తిగా మునిగిన కుర్రాడి కథ

ప్రేమలో పూర్తిగా మునిగిన కుర్రాడి కథ

- Advertisement -

హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన కొత్త సినిమా ‘దీవాన`. అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు.
ఈ సినిమాతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయం కానున్నారు.
ఈ సినిమా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 19న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సోమ వారం హీరో హర్షిత్ రెడ్డి మీడియా తో ముచ్చటించారు.
నేను నటించిన”శుభం` సినిమా కంటే ముందే ఈ సినిమా ఆఫర్ వచ్చింది.
ఇందులో నా క్యారెక్టర్ పేరు మున్నా. నా క్యారెక్టర్ రంగీలాలో ఆమిర్ ఖాన్ లా ఉండాలని మా డైరెక్టర్ చెప్పారు. ప్రేమలో పూర్తిగా మునిగిన ఓ కుర్రాడి కథే ఈ సినిమా. మనం చాలా ప్రేమ కథలు చూసి ఉంటాం. కాని ఇందులో ఒక కొత్త పాయింట్, ఎమోషన్ ఉంటుంది. ఆ పాయింట్ తో వచ్చే ఇంటర్వెల్ మిమ్మల్ని షాక్ కు గురి చేస్తుంది. కొద్ది నిమిషాలు మీరు అలా ఉండిపోతారు. మేము ట్రైలర్, టీజర్ లో కూడా ఆ పాయింట్ ఎక్కడా రివీల్ చేయలేదు. మనం రియల్ లైఫ్ లో ఎప్పుడో ఒకసారి దీవాన అవుతాం. మా డైరెక్టర్ కూడా ప్రేమలో ఒక దీవాననే.
అల్లు అరవింద్ కి మా మూవీ నచ్చి, రిలీజ్ చేసేందుకు ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -