8 రకాల వంగడాలతో రైతులకు అధిక లాభాలు
ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం
మంత్రులు తుమ్మల, శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లోనూ అద్భుతమైన డిమాండ్ ఉన్న ఎనిమిది రకాల మేలురకం వరి వంగడాల సాగుపై రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు సూచించారు. సోమవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. అందులో మంత్రులు డి. శ్రీధర్ బాబు, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తి, ధాన్యం కొనుగోలు కార్యకలాపాలు, నిల్వ సదుపాయాలు, వానకాలం సాగుపై సబ్ కమిటీ లోతుగా చర్చించింది. రైతులకు లాభాదాయకం, ఎగుమతులకు అనుకూలమైన బీపీటీ-5204, తెలంగాణ సోనా(ఆర్‌ఎన్‌ఆర్ 15048), కేఎన్‌ఎమ్-1638, జై శ్రీరామ్, హెచ్ఎంటీ, డబ్ల్యూజీఎల్962, డబ్ల్యూజీఎల్ 44, జేజీఎల్ 1798 రకాల వంగడాలను రైతులు పెద్ద ఎత్తున సాగు చేసుకునేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, శాస్ర్తవేత్తలు సబ్‌కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. మార్కెట్లో ఆ బియ్యానికి విపరీత డిమాండ్ ఉందనీ, ప్రభుత్వ మద్దతు ధర కంటే ఎక్కువ ధర పలికే అవకాశం ఉందని వివరించారు. తెలంగాణ నుంచి విదేశాలకు ఎగుమతి చేయడానికి 8 రకాలు అత్యంత అనుకూలమైనవనీ. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాలలో ఈ బియ్యానికి విపరీతమైన ఆదరణ ఉందని విడమర్చి చెప్పారు. ఆ రకం పంటలను సాగు చేయడానికి మార్కెట్లో విత్తనాల కొరత అస్సలు లేదనీ, సాగును విస్తృతం చేయడం సులువని వివరించారు.
విదేశాల్లో తెలంగాణ బియ్యానికి ఫుల్ డిమాండ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



