Monday, February 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం కప్ బెస్ బాల్ టోర్నమెంట్‌కు తొర్లికొండ క్రీడాకారులు

సీఎం కప్ బెస్ బాల్ టోర్నమెంట్‌కు తొర్లికొండ క్రీడాకారులు

- Advertisement -

నవతెలంగాణ-జక్రాన్‌పల్లి
రాష్ట్ర సీఎం కప్ బేస్‌ల్ టోర్నమెంట్ మండలంలోని తొర్లికొండ క్రీడాకారులు ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మర్కటి గంగా మోహన్ తెలిపారు. ఈనెల 14న మినీ స్టేడియం ఆర్మూర్ క్రీడ మైదానంలో జరిగిన సీఎం కప్ నిజామాబాద్ జిల్లా బెస్ బాల్ ఎంపిక పోటీలలో జడ్పిహెచ్ఎస్ తొర్లికొండ క్రీడాకారులు మహిళల విభాగంలో గేడం వనజ, పురుషుల విభాగంలో కొమిరె కిషోర్ పాల్గొని చక్కని ప్రతిభ కనబరిచి ఈనెల 17 నుండి 20 వరకు గచ్చిబౌలి స్టేడియం, హైదరాబాదులో జరగనున్న రాష్ట్ర 2వ ఎడిషన్ సీఎం కప్ బెస్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మర్కంటి గంగా మోహన్ తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర సీఎం కప్ బేస్ బాల్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జక్రాన్‌పల్లి మండల విద్యాధికారి మూడెడ్ల శ్రీనివాస్ అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర సీఎం కప్ పోటీల్లో పాల్గొన్న పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ రాష్ట్ర పోటీలలో జిల్లా జట్టును ప్రథమ స్థానంలో నిలపడానికి కృషి చేయాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -