- Advertisement -
రెండు రోజుల్లోనే అరెస్టు చేసిన పోలీసులు..
నవతెలంగాణ – కుభీర్
కుభీర్ మండల కేంద్రానికి చెందిన పుప్ఫల దత్తత్రికి చెందిన ఆటో (టీస్ 16 యుఏ 2615)ను ఈనెల 17న తను ఉన్న కిరాయి ఇంటి ఆపాడు. అయితే గుర్తు తెలియని దుండగులు ఆటోను ఎత్తుకెళ్లారు. వెంటనే అప్రమత్తమైన బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సోమవారం డోడర్నా గ్రామ శివారులో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటోతో సహా నిందితుడిని పట్టుకున్నారు. అనంతరం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే అపహరణకు గురైన ఆటో విలువ సుమారు రూ.80వేలు ఉంటుందని తెలిపారు.
- Advertisement -


