జిల్లాలో 22 స్టేషన్లో కెమెరాలు ఏర్పాటు
జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ (ఐపీఎస్)
నవతెలంగాణ-అచ్చంపేట
పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదుదారులతో పోలీసుల ప్రవర్తన వ్యవహార శైలి, పోలీస్ స్టేషన్ల నిర్వహణ, పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడేందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రతి పోలీస్ స్టేషన్లలో నిఘా కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ స్టేషన్ల ఆవరణం, ప్రవేశ ద్వారాలు, లాకప్ రూమ్ లు, ఎస్ఐ ల రూమ్ లు రాత్రి పూట కూడా స్పష్టంగా కనిపించేలా.. సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలలో పేర్కొన్నాయి.
రికార్డులైన ఆడియో, వీడియోలను (పుటేజీ లను ఏడాది పాటు భద్రంగా నిల్వ చేయాలని సూచించింది. ప్రతి పోలీస్ స్టేషన్లలో ఎస్ఐ లు సీసీ టీవీ ఫుటేజీలను భద్రపరచడం, సాంకేతిక సమస్యలు రాకుండా బాధ్యతలు తీసుకోవాలి. నాగర్ కర్నూల్ జిల్లాలో 20 మండలాల పరిధిలోని 22 పోలీస్ స్టేషన్ లలో ఒక్కొక్క స్టేషన్లో 11 సిసి కెమెరాల చొప్పున కెమెరాలు ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధితులు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా..! అవసరమైన కనీస సౌకర్యాలు ఉన్నాయా.! తదితర విషయాలను పరిశీలించి చర్యలు తీసుకోవడానికి పోలీస్ స్టేషన్లను సీసీ కెమెరాల పర్యవేక్షణలోకి తీసుకొచ్చారు.
రాష్ట్ర డిజిపి ఆఫీసు నుంచి నేరుగా పరిశీలించవచ్చు: జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ (ఐపిఎస్ )
పోలీస్ స్టేషన్లలో ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలో 22 పోలీస్ స్టేషన్ లలో సిసి కెమెరాలు ఏర్పాటు చేశాము. పోలీస్ స్టేషన్లో నిర్వహణ స్టేషన్ కు వస్తున్న బాధితులు ఎవరెవరు..? ఏ సమస్యల పైన స్టేషన్కు వస్తున్నారు..? అనే అంశాలను నేరుగా రాష్ట్ర డిజిపి ఆఫీసు నుంచి పరిశీలిస్తారు.



