Tuesday, February 17, 2026
E-PAPER
Homeసినిమాఆద్యంతం నవ్వించే సినిమా

ఆద్యంతం నవ్వించే సినిమా

- Advertisement -

ఇటీవల ‘లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా’ వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటి సక్సెస్‌ఫుల్‌ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, బన్నీ వాస్‌ వర్క్స్‌ బ్యానర్స్‌ పై ‘హే బలవంత్‌’ (‘హే భగవాన్‌’ చిత్రం టైటిల్‌ మార్పు) అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సుహాస్‌, శివానీ నగరం, సీనియర్‌ నటుడు నరేష్‌, యాంకర్‌ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి నిర్మించారు. ఈ మూవీని ఈనెల 20న రిలీజ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో శివానీ నగరం సోమవారం మీడియాతో ముచ్చటించారు.

-నాది సుహాస్‌తో రెండో సినిమా. నా కెరీర్‌లో మూడో సినిమా. సుహాస్‌తో ఇంతకు ముందు చేసిన సినిమాలో చాలా ఇంటెన్స్‌ క్యారెక్టర్‌. ఇంటెన్స్‌ స్టోరీ.. ఈ సినిమాలో చాలా లైటర్‌ వెయిన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ చేసే పాత్ర. చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన పాత్ర కూడా. సినిమా మొత్తం ఆడియన్స్‌ ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అవుతారు. చివర్లో ఫాదర్‌, సన్‌ ఎమోషన్‌ కూడా అందర్ని అలరిస్తుంది. సినిమాను అందరూ ఎంజాయ్ చేస్తారు. నాపాత్రలో ఇన్నోసెన్స్‌తో పాటు కామెడీ కూడా ఉంటుంది.
-ఈ సినిమాతో హ్యాట్రిక్‌ హిట్‌ వస్తుందనే నమ్మకం ఉంది. సుదర్శన్‌, సుహాస్‌, నా పాత్రలు మిమ్మల్ని బాగా నవ్విస్తాయి. ఇక నరేష్‌, వెన్నెల కిషోర్‌ క్యారెక్టర్స్‌ హిలేరియస్‌గా ఉంటాయి. సినిమాలో ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ మిమ్మల్నిసర్‌ఫ్రైజ్‌ చేస్తుంది. బాగా ఎంజాయ్ చేస్తారు.

-టీజర్‌లో బిజినెస్‌ అని చెప్పారు. అది సినిమాలో నరేష్‌ ఫ్యామిలి బిజినెస్‌. అది నాకు సంబంధం లేదు. అది థియేటర్‌లో చూసి మీరు మాత్రం కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. కడుపుబ్బా నవ్వుకుంటారు వెన్నెల కిషోర్‌. నరేష్‌ కామెడీ అలరిస్తుంది. ప్రతి పాత్ర నవ్విస్తుంది.
-సినిమా అంటే సినిమా. నాకు కథ, పాత్ర నచ్చితే పెద్ద హీరోల సినిమాలైనా ఒప్పుకుంటాను. ప్రేక్షకులు ఇచ్చిన విలువను నిలుపుకోవటం ముఖ్యం. ప్రస్తుతం తమిళంలో రెండు, తెలుగులో 2 సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -