25 కిలోల బాక్స్ రూ.800 పైనే..
నవతెలంగాణ – మల్హర్ రావు
టమాటా ధరలు పెరుగుతుండటంతో సాగు చేసిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం టమాటా 25 కిలోల బాక్సు రూ.800 నుం చి రూ.1000 వరకు పలుకుతోంది. మంథని డివిజన్ వ్యాప్తంగా సుమారు యాభై ఎకరాల్లో టమాటా పంటను సాగు చేశారు.డిమాండ్ ఉండటంతో వ్యాపారులే రైతుల వ్యవసాయ క్షేత్రాలకు వచ్చి పంటను కొనుగోలు చేస్తున్నారు. రోజు తప్పిరోజు ఎకరంలో 20 నుంచి 30 బాక్స్ వరకు పంట వస్తుందని, పంట పూర్తయ్యే వరకు ఎకరంలో వెయ్యి బాక్స్ల దిగుబడి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. 45 రోజులుగా టమాటా పంటకు నిలకడ ధర లభిస్తోంది. ముందుగా బాక్సు రూ.600 నుంచి రూ.800 పలికింది. తర్వాత రూ.550 కు తగ్గింది. అప్పటి నుంచి ధర పెరుగుతూనే ఉంటుందని.. రాబోయే రోజుల్లో మరింత ప్రియం కానున్నాయని రైతులు, చిరువ్యాపారులు పేర్కొంటున్నారు.
టమాటా ధర పైపైకి..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



