Tuesday, February 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చదువు.. విలువలే అసలైన ఆస్తులు 

చదువు.. విలువలే అసలైన ఆస్తులు 

- Advertisement -

ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి 
నవతెలంగాణ – నసురుల్లాబాద్ 

చదువు, విలువలే మనిషికి శాశ్వతమైన, అత్యంత విలువైన ఆస్తులు. సంపద తరగిపోవచ్చు కానీ, విద్య ద్వారా సంపాదించిన జ్ఞానం, వినయం, క్రమశిక్షణ జీవితాంతం తోడుంటాయని కళాశాల ప్రిన్సిపల్ మోహన్ రెడ్డి అన్నారు. బీర్కూర్ లో మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇటవల నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు గ్రామ సర్పంచ్ ధర్మతేజ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. చదువు మనిషికి వ్యక్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తే, విలువలు సమాజంలో గౌరవాన్ని, ఉన్నత స్థానాన్ని కల్పిస్తాయని. నిజమైన చదువు సంస్కారాన్ని నేర్పి, మంచి-చెడులను వివేకంతో గ్రహించేలా చేస్తుందన్నారు. చదువుతో మాత్రమే ప్రపంచాన్ని మార్చడం, పేదరికాన్ని నిర్మూలించడం సాధ్యమవుతుందన్నారు. గతంలో అమ్మాయిలను చదివించేందుకు తల్లిదండ్రులు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదని, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలతో వీరి ఆలోచన ధోరణిలో మార్పు వచ్చిందన్నారు.

ఉపాధ్యాయులు చెప్పిన పాటలకు సంబంధించి మంచిగా చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. పిల్లలు చదువు, విలువలను తెలుసు కావాలన్నారు విలువ లేనప్పుడు ఎంత ధనం కూడబెట్టి ఇచ్చినా ఉపయోగం ఉండదనే విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు చంద్రశేఖర్, సత్తెన్న, రంజిత్, నారాగౌడ్, సౌమ్య, సతీష్, దేవిసింగ్, విద్యార్థులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -