Thursday, June 18, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంలెబనాన్‌పై ఆగని ఇజ్రాయిల్‌ దాడులు

లెబనాన్‌పై ఆగని ఇజ్రాయిల్‌ దాడులు

- Advertisement -

అమెరికా, ఇరాన్‌ హెచ్చరికలు
బీరుట్‌ : దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయిల్‌ బాంబు దాడులు ఆగడం లేదు. మంగళవారం వేర్వేరు ప్రాంతాలలో జరిగిన దాడులలో కనీసం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ లెబనాన్‌లో హిజ్బల్లాలపై దాడులు ఆపాలని ఇజ్రాయిల్‌కు ఇరాన్‌ సూచించింది. దాడులు కొనసాగితే తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించింది. లెబనాన్‌లో ఘర్షణలకు, అమెరికా-ఇరాన్‌ యుద్ధానికి సంబంధం ఉన్నదని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ తెలిపారు. ఇదిలావుండగా జీ-7 దేశాల సదస్సుకు హాజరైన ట్రంప్‌ ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూపై విమర్శలు కురిపించారు. లెబనాన్‌ విషయంలో నెతన్యాహూ మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నదని హితవు పలికారు. హిజ్బల్లాతో ఇజ్రాయిల్‌ చాలా కాలంగా పోరాడుతోందని, అనేక మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. హిజ్బల్లాల విషయాన్ని సిరియా చూసుకోవాలని సూచించారు. ‘హిజ్బల్లా వ్యవహారాన్ని సిరియా అధ్యక్షుడు అహ్మద్‌ అల్‌-షరా చూసుకుంటారు’ అని ట్రంప్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -