Wednesday, February 18, 2026
E-PAPER
Homeసినిమాతెలుగులోనూ విజయం ఖాయం

తెలుగులోనూ విజయం ఖాయం

- Advertisement -

అజయ్ దిషన్‌, ధనుషా హీరో, హీరోయిన్స్‌గా గణేష్‌ చంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బుకీ’. విజయ్ ఆంటోనీ సమర్పణలో శరవంత్‌ రామ్‌ క్రియేషన్స్‌ బ్యానర్స్‌ పై రామంజేయులు జవ్వాజీ నిర్మించారు. సునీల్‌, లక్ష్మి మంచు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే తమిళంలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ రెస్పాన్స్‌ని అందుకుంది. తెలుగులో ఈ సినిమా ఈనెల 20న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మూవీ ప్రజెంటర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ,’భాష్యశ్రీతో ‘బిచ్చగాడు’ నుంచి జర్నీ కొనసాగుతోంది. ఈ సినిమాకి కూడా అద్భుతమైన మాటలు రాశారు. అజయ్ ‘మార్గన్‌’తో చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఈ సినిమాలో కూడా తన నటన మీ అందరినీ అలరిస్తుంది. ధనుషా స్క్రీన్‌ పై చాలా క్యూట్‌గా ఉంటుంది. ఈ సినిమాలో మంచు లక్ష్మి, సునీల్‌ పెర్ఫార్మెన్స్‌ అదిరిపోతుంది. ఈ సినిమా క్లైమాక్స్‌ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా కన్నీళ్లు వస్తాయి. అంతా రిలేట్‌ చేసుకునేలా ఉంటుంది. నిర్మాత రామ్‌తో ‘మార్గన్‌’ నుంచి అసోసియేషన్‌ ఉంది. సురేష్‌ ప్రొడక్షన్స్‌కి కృతజ్ఞతలు’ అని తెలిపారు. ‘తమిళంలో రిలీజై అద్భుతమైన రెస్పాన్స్‌ అందుకుంది. సినిమాలో చాలా పెద్ద సర్ప్రైజ్‌ ఉంది. సినిమా చూస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది. ఈ సినిమాని అందరూ థియేటర్స్‌లో చూసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నా’ అని డైరెక్టర్‌ గణేష్‌ చంద్ర చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -