Thursday, June 18, 2026
E-PAPER
HomeNewsదుర్వాసనమయమైన కుమ్మరిగల్లి

దుర్వాసనమయమైన కుమ్మరిగల్లి

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండల కేంద్రంలోని కుమ్మరిగల్లిలో మురుగునీరు ఏరులై పారుతోందని, మురికి కాలువలు చెత్తాచెదారంతో నిండిపోయాయని గురువారం కాలనీ వాసులు తెలిపారు. గత కొన్ని రోజులుగా కాలనీ అంతటా దుర్వాసన వెదజల్లుతోందని అన్నారు. దీనివలన స్తానికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన వారు ఆవేదన వ్యక్తం చేశారు. వృద్దులు, చిన్నారులు వాసన భరించలేక బయటకు రాలేకపోతున్నారని చెప్పారు. కాలువల నిండా దోమలు తిరుగుతున్నాయని, దీంతో ప్రజలు రోగాల బారిన పడే అవకాశం పొంచి ఉందని అన్నారు. అయినా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని తెలిపారు. కాలనీలో పారిశద్ధ్య పనులు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -