ఒకటి రెండు విడతల్లో రూ.5000 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిన ఎమ్మెల్యే..
ఇందిరమ్మ ఇండ్లకు ఉపాధి హామీ నిధులు..
నవతెలంగాణ-కుభీర్
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరుకు కృషి చేస్తామని నియోజకవర్గ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ సూచించారు. ఈ మేరకు గురువారం కుబీర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజురు పత్రాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుందన్నారు. అర్హులైన లబ్ధిదారులు చాలా మంది ఎల్ త్రీ లో ఉండడంవల్ల మంజూరుకు ఆలస్యం అవుతుందన్నారు.
ఇది తెలియక అధికారుల చుట్టూ లబ్ధిదారులు కార్యాలయాలు చెట్టు తిరుగుతున్నారని, ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శులతోనే సమస్యలు పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లలో అసలైన లబ్ధిదారులకు కాకుండా సొంత కలిగిన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన విషయం తన దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే ఎంపీడీవో పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు రెండో విడతలోనైనా పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీవో ఘాటుగా సూచించారు.
అనంతరం ఉపాధి హామీ నిధుల కింద మంజూరైన కోటి రూపాయలతో గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే మండల నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. అదే కళాశాలకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించి కళాశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు.
ఇందిరమ్మ ఇండ్లకు ఉపాధి హామీ నిధులు: డిఆర్డిఓ పీడీ విజయలక్ష్మి
రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులలో 95 రోజులు ఉపాధి హామీ నిధులు ఇందిరమ్మ లబ్ధిదారుల ఖాతాలో రోజుకు రూ.37 చొప్పున సుమారు రూ.35000 వరకు వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో ఉన్న లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భీమేష్ పేర్లుస్థానిక సర్పంచ్ సాయినాథ్, మండల అధ్యక్షులు ఏశాల దత్తత్రి, గులాబ్ నాయక్, ఆత్మ కమిటీ చెర్మన్ వివేక్,ఐకేపి ఎపిఎం దత్తాత్రి ఉపాధిహామీ ఎపి ఓ హరిలాల్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు మారుతీ మండల మాజీ వద్నామ్ నగేష్ ఆయా గ్రామాల సర్పంచులు దత్తహరి పటేల్ ప్రవీణ్ ఎంపీటీసీ లు ఇందిరమ్మ లబ్ధిదారులు ఆయా శాఖలకు చెందిన అధికారులు నాయకులు తదితరులు ఉన్నారు.



