Wednesday, February 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంముఖ్యమంత్రికి అభినందనలు

ముఖ్యమంత్రికి అభినందనలు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించిన నేపథ్యంలో పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. మంగళవారం రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, నాగర్‌ కర్నూల్‌ ఎంపీ డాక్టర్‌ మల్లు రవి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, నాగర్‌ కర్నూల్‌ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్‌ రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మెన్‌, వనపర్తి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు శివసేన రెడ్డి ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం నాగర్‌ కర్నూల్‌ ఎంపీ పరిధిలో అధిక సంఖ్యలో మున్సిపాల్టీలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుందని అభినందించారు. ప్రజలకు మెరుగైన సేవలందేలా చర్యలు తీసుకోవాలనీ, అవసరమైన సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -