Thursday, June 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

- Advertisement -

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహబూబాద్ జిల్లా కమిటీ సభ్యులు ఈసంపల్లి సైదులు 
నవతెలంగాణ-నెల్లికుదురు 

ఈనెల 20, 21, 22 న మహబూబ్  నగర్ లొ జరిగే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహబూబాబాద్ జిల్లా కమిటీ సభ్యులు ఇసంపేల్లి సైదులు అన్నాడు. గురువారం సంబంధిత కరపత్రాలను ఆవిష్కరించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  20వ తేదీన జరిగే బహిరంగ సభకు వ్యవసాయ కార్మికులు మహిళలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు.

ఈ మహాసభలో వ్యవసాయ కార్మికుల కోసం సంక్షేమ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై భవిష్యత్తులో వ్యవసాయ కార్మికుల హక్కులను సాధించడం కోసం ఉపాధిహామీని రక్షించడం కోసం వ్యవసాయ కార్మికులకు పెన్షన్స్ సౌకర్యం కల్పించాలని కనీస వేతనం అమలు చేయాలని వ్యవసాయ కార్మికులకు రక్షణ చట్టాన్ని అమలు చేయాలని కూలి పెంచాలని ప్రభుత్వ భూములు పేదలకు పంచాలని భవిష్యత్తులో జరిగే పోరాటాల దిశ నిర్దేశాన్ని చర్చించి పోరాటాల కొనసాగింపుకు ఈ మహాసభలు నిర్వహిస్తున్నారని, అందుకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాసభలో బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెరుమాండ్ల బాబు గౌడ్ మల్లయ్య శ్రీనివాస్ ఈ రామచంద్రు పద్మ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -