మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జేఈఈ మెయిన్ పరీక్షలో బీసీ గురుకుల ఇంటర్ విద్యార్థులు ఐదుగురు 90 కంటే ఎక్కువ పర్సంటైల్ సాధించారు. మరో 28 మంది విద్యార్థులు 80 కంటే ఎక్కువ పర్సంటైల్ సాధించారు. ఈ పరీక్షలకు బీసీ గురుకుల ఇంటర్ విద్యార్థులు 318 మంది హాజరయ్యారు. బాలికల విభాగంలో ఏ.నిత్య (92.19), సిహెచ్.గాయత్రి ( 91.50), ఎం.సహస్ర ( 87.69), పి.చరిత (86.20), ఎం.స్నేహ (85.09) పర్సంటైల్ సాధించారు. బాలుర విభాగంలో ఎం. నరేందర్ (91.58), ఆర్.కౌశిక్ (91.25), బి.మల్లేష్ ( 90.50), బి.హరీష్ (89.19), డి.రోహన్ (88.05) పర్సంటేజ్ సాధించారు.
ఈ సందర్భంగా ప్రతిభను చాటిన విద్యార్థినీ, విద్యార్థులను, బోధనా సిబ్బందిని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్య కార్యదర్శి ఈ.శ్రీధర్, ఏజేపీ సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు అభినందించారు. గత ప్రభుత్వం రెండు సీఓఈలలో విద్యార్థులకు పోటీ పరీక్షలకు కోచింగ్ ఇచ్చిందనీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 10 సీఓఈలను ఏర్పాటు చేసి కోచింగ్ ఇస్తున్నట్టు మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
జేఈఈ మెయిన్ పరీక్షలో మెరిసిన బీసీ గురుకుల విద్యార్థులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



