కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జీవన్ రెడ్డి వాటా ఎంతో చెప్పాలి : రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
నవతెలంగాణ – కరీంనగర్
దోచుకోవడం.. దాచుకోవడం బీఆర్‌ఎస్ పార్టీ పేటెంట్ హక్కు అని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో జీవన్ రెడ్డికి వచ్చిన వడ్ల కమీషన్ ఎంతో చెప్పాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. హరీశ్‌రావు మెప్పు పొందడానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్‌ఎస్ పార్టీ కార్యదర్శిగా ఉన్న ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తనపై ఇష్టం వచ్చినట్ల్ట మాట్లాడుతున్నారని అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అడ్లూరి మాట్లాడుతూ సంక్షేమ శాఖలో రూ.2వేల కోట్ల అవినీతి జరిగిందని హరీశ్‌రావు ఆరోపిస్తే ఆ శాఖ మంత్రిగా జవాబు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని మంత్రి అన్నారు. సంక్షేమ శాఖకు సంబంధించి విద్యార్ధులకు కావాల్సిన వస్తువుల కొనుగోలుకు రూ. 683 కోట్లతో టెండ్లర్లు పిలిచామని, రూ. 500 కోట్లతో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెండర్ల ఖారారు చేశామని మంత్రి అడ్లూరి తెలిపారు. మొత్తం రూ. 1183 కోట్లకు టెండర్లు పిలిస్తే మాజీ మంత్రి హరీశ్‌రావు రూ. 2వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తే ఆశాఖ మంత్రిగా జవాబు చెప్పానని వివరించారు. ‘తాను జవాబు చెప్పితే దొరగారి మెప్పు కోసం కొప్పుల ఈశ్వర్ ఖబ్దార్ అని మాట్లాడుతున్నారని’ ఎద్దేవా చేశారు.
టెండర్లలో భారీ కుంభకోణం : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల వస్తువుల సరఫరా కోసం పిలిచిన టెండర్లలో దాదాపు వందల కోట్ల భారీ కుంభకోణం జరిగిందని, దీనిపై దమ్ముంటే ‘సిట్’ లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల విద్యార్థులకు కావలసిన పుస్తకాలు, బూట్లు, టైలు, ప్లేట్లు వంటి వస్తువుల సరఫరా కోసం ప్రభుత్వం రూ.2,000 కోట్ల విలువైన టెండర్లు పిలిచిందన్నారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్‌కు సంబంధించిన 93 రకాల వస్తువుల సరఫరాకు రూ.761 కోట్ల టెండర్లను పిలవగా, మార్కెట్ ధరలతో పోల్చితే ఇందులో రూ.200 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ‘మన షూస్’ అనే లోకల్ దళిత యువకుడి సంస్థ దరఖాస్తు చేసుకుంటే.. రూ.300 కోట్ల టర్నోవర్ నెపంతో తిరస్కరించి, బయటి రాష్ట్రాల సంస్థలకు రెడ్ కార్పెట్ పరిచారని ఆరోపించారు.
దోచుకోవడం బీఆర్‌ఎస్ పేటెంట్ హక్కు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



