సింగరేణి బాయి బాటలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత
నవతెలంగాణ – యైటింక్లైన్ కాలనీ/కరీంనగర్
ఆడబిడ్డలకు పసుపు అంటే ఎంతో పవిత్రమైన దని పసుపు జెండా, ఎర్ర జెండా కలిసి రాష్ట్రంలో నూతన ఎజెండా తీసుకువస్తామని టిఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. గురువారం పెద్దపల్లి జిల్లా ఆర్జీ-2 ఏరియాలోని ఓసీపీ-3లో హెచ్ఎంఎస్ నేత రియాజ్ అహ్మద్ తో కలిసి బాయి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గతంలో ప్లేడేల విషయంలో కొంత తప్పు జరిగిందని దానిని సరిదిద్దుకుంటామని అన్నారు. మెడికల్ ఉద్యోగాలు ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తోందని మండి పడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కండెం సురేష్,సాజన్,దావు రమేష్, రత్నాకర్ రెడ్డి,అనిల్ రెడ్డి, అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత పర్యటనలో స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
కోటరీ రాజకీయాలు ఉండవు : కవిత
తెలంగాణను హస్తగతం చేసుకోవాలనే కుట్రతోనే పవన్ కల్యాణ్ వెనుక ఉండి బీజేపీ నడిపిస్తోందని తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. కరీంనగర్లో నిర్వహించిన‘తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు – సాధన’ రౌండ్ టేబుల్ సమావేశం ముగింపు సందర్భంగా ఆమె మాట్లాడారు. పవన్ కల్యాణ్ రూపంలో మేకవన్నె పులిలా బీజేపీ వస్తోందని, ఆ పార్టీ డైరెక్ట్‌గా పోటీ చేస్తే 8 సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్‌తో ఏదో మాట్లాడిస్తే తెలంగాణ ప్రజలు ఆవేశంగా స్పందిస్తారని భావిస్తు న్నారని, జీహెచ్ఎంసీ చుట్టుపక్కల ప్రాంతాల విలీనం వెనుక కూడా కుట్ర దాగి ఉందన్నారు. బీజేపీ వస్తే మన సంస్కృతి దెబ్బతింటుందని, మైసమ్మ, దుర్గమ్మ లాంటి ఊరి దేవతలు ఉండరని, ఒకటి రెండు దేవుళ్లను మాత్రమే పూజించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కోటరీ రాజకీయాల వల్ల తాను కూడా బలయ్యానని, అందుకే టీఆర్ఎస్-2 లో కోటరీ వ్యవస్థ ఉండదని కవిత స్పష్టం చేశారు. ఇన్నాళ్లూ మగ నాయకుల పాలన చూశారని, తనకో అవకాశం ఇస్తే మార్పు ఏంటో చూపిస్తానన్నారు.
పసుపు, ఎర్రజెండాతో రాష్ట్రానికి నూతన ఎజెండా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



