- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: గుజరాత్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మోర్బీ జిల్లా వాంకానేర్ ప్రాంతంలో గల మాటెల్ రోడ్డులోని ఒక పేపర్ మిల్లులో భారీగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. మంటలను ఆర్పేందుకు పలు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం అగ్నిమాపక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



