బీఆర్ఎస్ జిల్లా నాయకులు బాల్ రెడ్డి
నవతెలంగాణ-మిడ్జిల్
మిడ్జిల్ గ్రామాభివృద్ధిలో మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి పాత్ర మరువలేనిదని బీఆర్ఎస్ జిల్లా నాయకులు మన్యం బాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ సుదర్శన్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ మండల నాయకులు వెంకట్ రెడ్డి 49వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాన్ని రాజకీయాలకు అతీతంగా ఆయన ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు. ఈ నెల 30న వెంకట్ రెడ్డి మొదటి వర్ధంతి సందర్భంగా మిడ్జిల్లో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాడియాల సర్పంచ్ చంద్రయ్య గౌడ్, నాయకులు నామిని శ్రీనివాసులు, గంజి శేఖర్, గంజి కృష్ణ, కరుణాకర్ రెడ్డి, భీమ్ రాజ్, బంగారు దానయ్య, జగన్ గౌడ్, సిరాజ్, రమేష్, మల్లయ్య, శ్రీనివాసులు ,ప్రశాంత్ రమేష్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మిడ్జిల్ గ్రామాభివృద్ధిలో వెంకట్ రెడ్డి పాత్ర మరువలేనిది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



