నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా మాచరెడ్డి మండలం పరిధిలోని చుక్కాపూర్ గ్రామంలో మంగళవారం సాయంత్రం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కోనేరు బావిలో గుర్తుతెలియని ఓ మగ వ్యక్తి మృతి చెందిన స్థితిలో ఉందని తమకు సమాచారం వచ్చిందని మాచారెడ్డి పోలీసులు తెలిపారు. మంగళవారం (17 – 02 – 2026) సాయంత్రం సుమారు 7:00 గంటల సమయంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే మాచరెడ్డి పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బావి నుండి బయటకు తీసి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టడం జరిగిందని మాచరెడ్డి పోలీసులు తెలిపారు.
మృతుడి వయస్సు సుమారు 30 నుండి 40 సంవత్సరాల మధ్యగా అంచనా వేస్తున్నారు. మృతుడు బ్లూ టీ – షర్ట్, వైట్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యక్తి గురించి ఎవరికైనా సమాచారం తెలిసినట్లయితే మాచరెడ్డి పోలీస్ స్టేషన్ ఎస్.ఐ అనిల్ కుమార్ ను సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్: 8712686151ఎస్.ఐ ఆఫ్ పోలీస్ మాచరెడ్డి పోలీస్ స్టేషన్.



