నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బోనగిరి భాస్కర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..రాహుల్ గాంధీ రాజ్యాంగ రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడని కొనియాడారు.
రాహుల్ గాంధీకి ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య, వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, మాజీ మండల అధ్యక్షుడు సుంకేట రవి, జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకులు మురళి, తిప్పిరెడ్డి శ్రీనివాస్, అమీనాపూర్ అధ్యక్షుడు భూమారెడ్డి, టౌన్ అధ్యక్షుడు సాల్లూరి గణేష్, ఉప్లూర్ అధ్యక్షుడు నరేష్, సాదుల్ల, నిమ్మ రాజేంద్ర ప్రసాద్, బుచ్చిమల్లయ్య, నరేందర్ అజార్, అల్లకొండ రాజేశ్వర్, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.



