Friday, June 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చౌట్ పల్లిలో ప్రభుత్వ జూ.కళాశాల అధ్యాపకుల అడ్మిషన్ డ్రైవ్

చౌట్ పల్లిలో ప్రభుత్వ జూ.కళాశాల అధ్యాపకుల అడ్మిషన్ డ్రైవ్

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు శుక్రవారం ప్రిన్సిపాల్ జైపాల్ రెడ్డి ఆదేశాల మేరకు ఇంచార్జి  ప్రిన్సిపల్ మధు కుమార్ ఆధ్వర్యంలో చౌట్ పల్లి అడ్మిషన్ డ్రైవ్ నిర్వహించారు. గ్రామంలో పదో తరగతి పాస్ అయిన విద్యార్థిని విద్యార్థుల ఇంటర్ అడ్మిషన్ల కోసం గ్రామ సర్పంచ్ మహబూబ్ సహకారంతో ఇంటింటికి తిరిగి విస్తృత ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మహబూబ్ మాట్లాడుతూ కమ్మర్ పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అన్ని సబ్జెక్టులకు పూర్తి అధ్యాపక బృందం ఉన్నందువల్ల మండలంలోని పదో తరగతి పాస్ అయిన విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. గ్రామం నుండి 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరేలా గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున సహకారం అందిస్తామన్నారు. ఇంచార్జి ప్రిన్సిపల్ మధు కుమార్ మాట్లాడుతూ పాఠ్యపుస్తకాలు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తుందని, అంతేకాక త్వరలోనే మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు వెంకటేష్, వార్డు మెంబర్ రిత్విక్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -