Thursday, February 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయండేటా సెంటర్ల ప్రతిపాదనలు సిద్ధం చేయండి

డేటా సెంటర్ల ప్రతిపాదనలు సిద్ధం చేయండి

- Advertisement -

అధికారులకు సీఎస్‌ ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు అధికారుల్ని ఆదేశించారు. బుధవారంనాడిక్కడి డాక్టర్‌ బీఆర్‌ ఆంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో ఈ అంశంపై ఆయన ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఐ.టి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్‌, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ శశాంక, ఐటి శాఖ ప్రత్యేక కార్యదర్శి భవేష్‌ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే సంస్థలకు పూర్తి స్థాయిలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు.

ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి దీనిపై చాలాసార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా డేటా కేంద్రాల ఏర్పాటుకు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌లో ఇస్తున్న రాయితీలపై చర్చించారు. ఈ కేంద్రాల ఏర్పాటుకు 100 శాతం గ్రీన్‌ ఎనర్జీ సోర్స్‌ సౌకర్యం, కావాల్సిన విద్యుత్‌ను బహిరంగ సేకరణ ద్వారా పొందడం, డెడికేటెడ్‌ పవర్‌ సప్లయ్ నెట్‌వర్క్‌, ఎస్‌జీఎస్‌టీ రీ-ఎంబర్స్‌మెంట్‌ సహా పలు అభ్యర్థనలను పెట్టుబడిదారులు కోరుతున్నారని తెలిపారు. వీటన్నింటిపై వెంటనే అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. డేటా సెంటర్ల ఏర్పాటుతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలతో పాటు అనుబంధ రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -