– దేవ్ జీ నే లక్ష్యం…
– గడువు ముగియడానికి ఇంకా 40 రోజులు మాత్రమే!
– పక్క సమాచారం తో ఆపరేషన్–2 స్టార్ట్
నవతెలంగాణ-చర్ల: కర్రేగుట్టల అడవి ప్రాంతంలో మరోసారి భద్రతా బలగాల కదలికలు వేగం పుంజుకున్నాయి. “ఆపరేషన్–2” పేరుతో ప్రత్యేక దళాలు దాడులు, కూంబింగ్ చర్యలు ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈసారి లక్ష్యం దేవ్ జీ అని తెలుస్తోంది. సమాచారం ప్రకారం, గడువు ముగియడానికి ఇంకా 40 రోజులు మాత్రమే మిగిలి ఉండగా, పక్కా ఇంటెలిజెన్స్ ఆధారంగా ఆపరేషన్ 2 ప్రారంభించినట్టు తెలుస్తోంది. అడవి మార్గాలు, కొండ చరియలు, గుట్టల పరిసర ప్రాంతాల్లో కఠిన తనిఖీలు కొనసాగుతున్నాయి. స్థానిక గ్రామాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసినట్లు సమాచారం. అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. భద్రతా వర్గాలు అధికారికంగా ప్రకటన చేసినట్టు సమాచారం , కర్రేగుట్టల పరిసరాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్టు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ లో ఈ సారి డీ ఆర్ జీ బలగలు దిగానున్నాయి…
కర్రేగుట్టలు ఆపరేషన్–2 ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



